నాని మాటలకు మౌనం వహిస్తున్న దిల్ రాజ్ !
ప్రస్తుత కరోనా పరిస్థితులలో సినిమా థియేటర్స్ ఎప్పుడు తిరిగి ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితులలో తమ సినిమాలకు ఓటీటీ రిలీజ్ మాత్రమే మంచిదని చాలమంది నిర్మాతలు భావిస్తున్నారు. దీనికితోడు ఓటీటీ లు కొన్ని సినిమాలకు మంచి డీల్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఈలిస్టులో దిల్ రాజ్ నిర్మించిన ‘వి’ మొదటిస్థానంలో ఉంది.
మొదట్లో ఈమూవీని ఓటీటీ లో విడుదల చేయడానికి పెద్దగా ఇష్టపడని దిల్ రాజ్ ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘వి’ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేయడానికి నాని అసలు ఇష్టపడడం లేదు అని టాక్. అయితీ ‘వి’ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో ప్రస్తుత పరిస్థితులలో క్లారిటీ లేని పరిస్థితులలో దిల్ రాజ్ కు ఈసినిమా విషయమై ఆర్థికపరంగా జరిగే నష్టానికి ఈసినిమాకుసంబంధించి తనకు ఇచ్చే పారితోషికంలో అడ్జస్ట్ మెంట్ చేసుకోవచ్చు అనేది నాని అభిప్రాయం అని అంటున్నారు.
దీనికి కారణం సాలిడ్ మార్కెట్ ఉన్న తనలాంటి హీరో సినిమా ఓటిటిలో విడుదలయితే అది తాను నటించబోయే భవిష్యత్ చిత్రాల పై ప్రభావం చూపెడుతుంది అని నాని ఆలోచన అని అంటున్నారు. వస్తవానికి దిల్ రాజ్ కు నాని చెపుతున్న కారణాలు పూర్తిగా నచ్చకపోయినా నానితో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలు బెడిసి కొట్టకూడదని దిల్ రాజ్ మౌనం వహిస్తున్నట్లు టాక్.
ఈ మూవీకి మొదట్లో చాలమంచి క్రేజ్ ఏర్పడటం తో ఈ చాలమంచి బిజినెస్ జరుగుతుందని దిల్ రాజ్ భావించాడు. దీనికితోడు ఈ మూవీ పై ఉన్న నమ్మకంతో దిల్ రాజ్ ఈ మూవీ రేంజ్ కి మించి ఖర్చు పెట్టాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయినా సినిమాల బిజినెస్ పూర్వపు స్థాయిలో ఉండవు కాబట్టి ఈ మూవీ విషయంలో ఎలా వ్యహరించాలో తెలియక దిల్ రాజ్ తలపట్టుకున్తున్నట్లు టాక్..