పెన్నుకు పనిచెప్పేసిన డైరెక్టర్స్..!

NAGARJUNA NAKKA

రాయడం వస్తే ఎలాగోలా బతికేయొచ్చని కరోనా రుజువు చేసింది. ఓన్లీ డైరెక్టర్ అయితే.. కరోనా తగ్గేవరకు వెయిట్ చేయాలి. నటీనటులదీ ఇదే పరిస్థితి. ఇదే రైటర్ కమ్ డైరెక్టర్ అయితే.. మెగా ఫోన్ పట్టలేకపోయినా.. పెన్నుపట్టుకొని కరోనా టైమ్ లో కూడా నాలుగు డబ్బులు వెనుకేసుకోవచ్చు. ప్రస్తుతం కొందమంది దర్శకులు ఇదే ఫాలో అవుతున్నారు. 

రైటర్స్ దగ్గర ఎన్ని కథలున్నా ఉపయోగం లేదు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు ఓకే చేసే సిట్యువేషన్ లో హీరోలు, నిర్మాతలు లేరు. సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తయితే చాలనుకుంటారు. పెళ్లి చూపులతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్-భాస్కర్ దగ్గర చాలా కళలు ఉన్నాయి. తన సినిమాలకు తనే కథలు.. మాటలు రాసుకుంటారు. ఈ నగరానికి ఏమైంది ఫ్లాప్ తర్వాత మెగా ఫోన్ కు దూరంగా ఉన్నాడు. ఈలోగా.. టీవీ ప్రోగ్రామ్స్ కు హోస్ట్ గా మారాడు. వెంకటేశ్ తో సినిమా ఓకే అయినా.. ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. 

కరోనా టైమ్ లో ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించే పని మొదలుపెట్టారు తరుణ్ భాస్కర్. విశ్వక్ సేన్ నటించే తమిళ రీమేక్ ఓ మై కడలేకు తరుణ్ మాటలు రాస్తున్నాడట. పివిపి సినిమా నిర్మించే ఈ మూవీకి తను దర్శకుడు కాకపోయినా.. ఈ ఖాళీ టైమ్ ను ఉపయోగించుకుంటూ మాటలు అమ్ముకొని.. బతికేస్తున్నాడు తరుణ్ భాస్కర్. 

కొరటాల శివ సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. 2018 సమ్మర్ లో వచ్చిన భర్త అనే నేను తర్వాత ఇంత వరకు కనిపించలేదు. చిరంజీవితో ఆచార్య సినిమా కమిట్ అయినా.. సైరా పూర్తయి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈలోగా ఏడాదిన్నర గడిచిపోయింది. ఆచార్య సెట్స్ పైకి వచ్చినా.. ఇంతలో కరోనా అడ్డుకుంది. రెండేళ్ల నుంచి ఒకే సినిమాతో ట్రావెల్ చేసిన కొరటాల ఆచార్యను పక్కన పెట్టేసి.. పెన్నుకు పని పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: