స్క్రీన్‌పై విద్యుల్లేఖా క‌నిపిస్తే ప్రేక్ష‌కుల‌కు పండ‌గే!!

Kavya Nekkanti

తెలుగు సినీ పరిశ్రమలో హస్య నటులంటే.. ట‌క్కున మగాళ్లే గుర్తుకువ‌స్తారు. కానీ అంతేస్థాయిలో పేరు, ప్రఖ్యాతులు సాధించిన హాస్య నటీమణులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో విద్యుల్లేఖా రామన్ కూడా ఒక‌రు. సిల్వర్‌ స్క్రీన్‌పై విద్యుల్లేఖా క‌నిపిస్తే.. కామెడీకి కొదవ ఉండద‌ని.. ప్రేక్ష‌కుల‌కు పండ‌గే అని చాలా అంటుంటారు. అవును! నేటి త‌రం లేడీ క‌మెడియ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో విద్యుల్లేఖా ఒకరు.

ఎటో వెళ్లిపోయింది మనసు, రాజు గారి గ‌ది, భాగ‌మ‌తి, నిన్ను కోరి, సరైనోడు, అర్జున్ సుర‌వ‌రం, రన్ రాజా రన్, రాజా ది గ్రేట్, వెంకీమామ‌ లాంటి చిత్రాలలో తనదైన మార్కు హాస్యంతో  ఈ అమ్మ‌డు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది. రన్ రాజా రన్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ హాస్య నటిగా నంది అవార్డు కూడా అందుకుంది. వాస్త‌వానికి తమిళ టీవీ నటుడు మోహన్ రామన్ కుతురైన విద్యుల్లేఖ న‌ట‌న‌తో పాటు లుక్ తోనూ వెండితెరపై జనాలను నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది.

అయితే ఇప్పుడు ఆమె ఎవరు ఊహించని విధంగా మారిపోయింది. నేటితరం యంగ్ హీరోయిన్స్ లాగా చాలా స్లిమ్ గా మారి అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. స్లిమ్‌గా మారిన విద్యుల్లేఖ ఫోటోలు కూడా ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కాగా, ఈ అమ్మడు తమిళ్ నటి అయినప్పటికీ ఎక్కువగా తెలుగు సినిమాలతోనే బిజీ అవుతోంది. ఈ క్ర‌మంలోనే విద్యుల్లేఖపై అనేక విమర్శలు వినిపించాయి. కేవలం తెలుగు చిత్రాలకే ఆమె ప్రాధాన్యత ఇస్తోందని తమిళ చిత్రపరిశ్రమలో కొందరు ఈమెపై విమ‌ర్శ‌లు కురిపించారు. అయితే తనకు తమిళం కంటే తెలుగులోనే మంచి అవకాశాలు వస్తున్నాయ‌ని విద్యుల్లేఖా క్లారిటీ కూడా ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: