
పూరి-రామ్ మాసివ్ బ్లాక్ బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్'కు ఏడాది
టాలీవుడ్ లో మాస్ కంటెంట్ అడ్రస్ మార్చేసిన డైరక్టర్ పూరి జగన్నాధ్. కెరీర్లో ఏ హీరోకైనా మాస్ ఇమేజ్ రావాలన్నా.. డైలాగ్ డిక్షన్ లో మార్పు, పెర్ఫార్మెన్స్ లో వేరియేషన్స్ రావాలన్నా.. ఖచ్చితంగా పూరితో సినిమా చేయాల్సిందే. పూరి దర్శకత్వంలో నటించిన ప్రతి హీరోలో ఈ మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే మ్యాజిక్ ను మరోసారి ‘ఇస్మార్ట్ శంకర్’తో చేశాడు పూరి. లవర్ బాయ్ గానే 13ఏళ్లు గడిపేసిన రామ్ ను ఒక్కసారిగా మాస్ హీరోగా మార్చేశాడు. సరిగ్గా ఏడాది క్రితం విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.

రామ్ ను ఊరమాస్ లుక్ లో చూపించిన ఈ సినిమా 2019 జూలై 18న విడుదలైంది. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తున్న పూరికి ఈ సినిమా పరిక్షలా నిలిచింది. దీంతో తనలోని పూర్తి టాలెంట్ ను మరోసారి ప్రొజెక్ట్ చేశాడు. కథ, కథనం, టేకింగ్.. లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా రామ్ మేకోవర్ నే సినిమాకు హైలైట్ చేశాడు. రామ్ లుక్, డైలాగ్ మాడ్యులేషన్ మార్చేసి తనకు కెరీర్ బెస్ట్ ఇచ్చాడు పూరి. రామ్ లోని ఫుల్ ఎనర్జీని ఎలా తీసుకోవచ్చో శంకర్ క్యారెక్టర్ ద్వారా అంతా రాబట్టాడు. అదేస్థాయిలో రామ్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు.

మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా సూపర్ హిట్ అయింది. మణిశర్మ మాస్ బీట్స్ తో తన స్థాయి సంగీతం అందించి ఇండస్ట్రీకి తన సత్తా గుర్తు చేశాడు. చార్మి ఒక నిర్మాతగా పూరి కనెక్ట్స్ లో స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు పూరి. హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేశ్ నటించారు. పూరి, మణిశర్మ, రామ్.. కెరీర్ కు మళ్లీ బూస్టప్ ఇచ్చిన సినిమాగా ‘ఇస్మార్ట్ శంకర్’ నిలిచింది.
One year back on this same day it was like a festival 🥳
Thanks a lot my most hard working producer @Charmmeofficial ,u were soo stubborn to make #iSmartShankar a blockbuster,
My dears @AgerwalNidhhi @NabhaNatesh @ActorSatyaDev n complete team,love u all #1YearForiSmartShankar pic.twitter.com/NqkjWyr1BS — PURIJAGAN (@purijagan) July 18, 2020