రామ్ చరణ్ కి తన తల్లి అంటే ఎంత ఇష్టమో తెలుసా..?
ఇక అతని తల్లి అయిన సురేఖ కొణిదల చెర్రీ మీద ఎనలేని ప్రేమ ను చూపిస్తారు. చెర్రీకి 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ అతడిని ఇప్పటికీ చిన్నపిల్లాడిలాగా చూస్తూ అక్కున చేర్చుకుంటారు సురేఖ కొణిదల. 2019 వ సంవత్సరం లో రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి తన తల్లితో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేశారు. "కొన్ని ఎప్పటికీ మారవు. నా మొట్ట మొదటి పోస్ట్ ని నా అమ్మ కి అంకితం చేస్తున్నాను. ఐ లవ్ యు అమ్మ" అని రామ్ చరణ్ తనకి తన అమ్మ పై ఉన్న ప్రేమను బయట పెట్టారు.
సురేఖ కొణిదల పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 18వ తారీకు ఇన్స్టాగ్రామ్ వేదికగా రామ్ చరణ్ ప్రత్యేకంగా బర్తడే విషెస్ తెలిపి తన అభిమానులకు కన్నుల విందు చేశారు. "నా మొట్టమొదటి ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఐ లవ్ యు మామ్", అంటూ రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులో జత చేసిన ఫోటోలలో రామ్ చరణ్ తన అమ్మను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. అలాగే ఉపాసన కొణిదెల సురేఖ తో కలిసి దిగిన ఫోటోని కూడా ఈ పోస్టులో చెర్రీ జత చేశారు. వాస్తవానికి చెర్రీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన తల్లిదండ్రులతో తాను గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలే ఎక్కువగా ఉంటాయి.
Powered by Froala Editor