త‌ల్లి విజయదుర్గ గురించి సాయిధరమ్‌ తేజ్ ఆస‌క్తిక‌ర విష‌యాలు!!

Kavya Nekkanti

మెగా మేన‌ల్లుడు సాయిధరమ్‌ తేజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పిల్లా నువ్వులేని జీవితం` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈయ‌న మొద‌ట పరాజయాలను అందుకున్నా.. ప్ర‌స్తుతం వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నారు. వరుసగా ఆరు సినిమాలు డిజాస్టర్ అయినా ఏ మాత్రం వెనక్కితగ్గని సాయిధ‌ర‌మ్ తేజ్ ఇటీవలే చిత్ర లహరి, ‌ప్రతీ రోజూ పండగే సినిమాల‌తో సూపర్ హిట్ కొట్టాడు.  ఇక ఇప్పుడు సాయి తేజ్‌ `సోలో బ్రతుకే సో బెటర్` అనే సినిమా చేస్తూనే.. మరో సినిమాను కూడా సెట్స్‌‌ మీదకు తీసుకొచ్చాడు. 

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. హీరో నుంచి జీరోకు జారిపోయినా అమ్మ ప్రేమ మారదు. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో అమ్మనే హీరో. మెగాస్టార్‌ చిరంజీవి చెల్లెలు విజయదుర్గ, ఆమె కొడుకు సాయిధరమ్‌ తేజ్‌ల బంధం చూసినప్పుడు ఇలాంటి భావనే కలుగుతుంది. సాయి తేజ్ వాళ్ల అమ్మ గురించి ఎన్నో సార్లు ఎన్నో విష‌యాలు అభిమానుల‌తో పంచుకున్నారు. సాయి తేజ్‌ సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు కూడా ఆమె అడ్డు చెప్పలేద‌ట‌. అయితే మావయ్యల సహకారం తీసుకోకుండా నిజాయతీగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. వారి సపోర్ట్‌ కావాలనుకున్నప్పుడు మాత్ర‌మే తీసుకో అని సలహా ఇచ్చార‌ట విజ‌య‌దుర్గ‌.

ఆ మాటే నాకు పెద్ద బూస్ట్‌లా అనిపించింద‌ని సాయి తేజ్ ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు,  నన్నూ, తమ్ముడిని బిడ్డల్లాగా కాకుండా స్నేహితుల్లా చూస్తుంద‌ని.. ఇక ఆటలు, చదువు, కెరీర్‌ అన్ని విషయాల్లోనూ మేము అడిగింది కాదనకుండా అమ్మ మాకు సమకూర్చింద‌ని సాయి తేజ్ వివ‌రించాడు. ఇక మ‌రో విష‌యం ఏంటంటే.. కొన్నాళ్ల‌ పాటు ఒంట‌రిగా ఉన్న‌ తల్లి విజ‌య‌దుర్గ‌ను ఒప్పించి రెండు వివాహం చేసింది కూడా సాయి తేజ్‌నే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: