మరోసారి ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న సూపర్ స్టార్.....??

GVK Writings

కరోనా కారణంగా ప్రస్తుతం లాక్ డౌన్ విధించడంతో ఇంట్లోనే ఉంటూ, తన కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇటీవల తన తదుపరి సినిమా సర్కారు వారి పాట ను అనౌన్స్ చేసిన సూపర్ స్టార్, ప్రస్తుతం ఆ సినిమాలో తన పాత్ర కోసం సరికొత్త మేకోవర్ ట్రై చేస్తున్నట్లు టాక్. బ్యాంక్ మోసాల నేపథ్యంలో పలు కమర్షియల్ హంగులతో రూపొందనున్న ఈ సినిమాని యువ దర్శకుడు పరశురాం తెరకెక్కించనుడగా, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు దీనిని ఎంతో భారీగా నిమరించనున్నాయి. వాస్తవానికి ఈ సినిమా స్థానంలో మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయాల్సి ఉంది. 

అయితే ఆ సినిమా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో పరశురామ్ కు మహేష్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సర్కారు వాటి పాట అనంతరం తప్పకుండా వంశీ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా  ఉంటుందని, ఇప్పటికే ఆ సినిమా పూర్తి స్క్రిప్ట్ ని పక్కాగా సిద్ధం చేసిన వంశీ, అతి త్వరలో దానిని మహేష్ కు వినిపించనున్నారని అంటున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని సమాచారం. అందుకోసం ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన ఇద్దరు యువ భామలను కూడా వంశీ సంప్రదించారని అంటున్నారు. 

 

సినిమా కథ, కథనాలు ఎంతో నచ్చిన ఆ ఇద్దరూ కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ విషయమై అతి త్వరలో అనౌన్సుమెంట్ కూడా రానుందని సమాచారం. గతంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా తరువాత ఇప్పటివరకు మహేష్ బాబు ఇద్దరు హీరోయిన్స్ తో నటించ లేదు. ఒకవేళ ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే మాత్రం, కొంత గ్యాప్ తరువాత మరోసారి తెరపై ఇద్దరు భామలతో సూపర్ స్టార్ రొమాన్స్ చూడవచ్చన్నమాట.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: