వెయిటే అనుష్క పాలిట శాపంగా మారిందా..?
ఒక్క ప్లాప్ వస్తే చాలు హీరోయిన్ల కెరీర్ తారుమరవుతుంది. అప్పటి వరకు ఉన్న స్టార్ డమ్ తగ్గిపోయి కెరీర్ కష్టాల్లో పడుతుంది. అందుకే తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేేసేందుకు ఆరాటపడుతుంటారు హీరోయిన్లు. కానీ కరోనా ఎఫెక్ట్ వీళ్ల ఆరాటాన్ని ఆవిరి చేస్తోంది. లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చుకున్నా అనుష్క కష్టాలు తగ్గడం లేదు. కమర్షియల్ మూవీస్ దూరంగా వెళ్లిపోయాక స్వీటీ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనే నటిస్తోంది. అయితే ఆమె వెయిట్ పెరిగాక ఈ జానర్ లోనూ అవకాశాలు తగ్గిపోయాయి.
అనుష్క చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సిినిమా ఉంది. నిశ్శబ్ధం తర్వాత మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు స్వీటీ. అయితే గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఒక యాక్షన్ థ్రిల్లర్ చేయబోతోందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ గా ఈ మూవీ వస్తుందనే మాటలు వినిపించాయి. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి.
అనుష్క 40 సంవత్సరాలకు రెండడుగుల దూరంలో ఉంది. 38ఏళ్ల వయసుతో సౌత్ హీరోయిన్లందరినీ బీట్ చేస్తోంది. మరో రెండేళ్లయితే ఈమె గ్రాఫ్ మరింత కష్టాల్లోకి వెళ్తుందని చెప్పొచ్చు. కానీ ఈ కరోనా వచ్చి అనుష్క నుంచి ఓ ఏడాదిని లాక్కుంది. ఆమె కెరీర్ ను తినేసింది.
సూపర్ మూవీతో సినిమా ఎంట్రీ ఇచ్చిన అనుష్క కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. అరుంధతి సినిమాతో తనలోని వైవిధ్యమైన కోణాన్ని ప్రజలకు చూపి మన్ననలు పొందింది. బాహుబలిలో ఆమె నటనకు సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతున్న జేజెమ్మ కెరీర్ ప్రస్తుతం కొంత ఇబ్బందిగానే ఉంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో..