కొడుకు విషయంలో రంగంలోకి దిగిన విక్రమ్..!
కొడుకు కెరీర్ సెట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు విక్రమ్. బెస్ట్ ఫ్రెండ్ తో గొడవపడి మరీ సినిమా తీసినా వారసుడికి సక్సెస్ రాలేదు. అన్ అఫీషియల్ గా డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నా సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయలేకపోయాడు. దీంతో వెన్నంటి ఉండి కొడుకు కెరీర్ ని ట్రాక్ ఎక్కించాలనుకుంటున్నాడు విక్రమ్.
విక్రమ్ కు ఉన్న తలనొప్పులు సరిపోవన్నట్టు ఇపుడు కొడుకు బెంగ పట్టుకుంది. తన కెరీర్ ను ట్రాక్ ఎక్కించుకోవడానికే టైమ్ సరిపోవటం లేదంటే ఇప్పుడు కొడుకు గురించి ఓవర్ టైమ్ చేస్తున్నాడు విక్రమ్. వారసుడు ధృవ్.. విక్రమ్ కు కోలీవుడ్ లో సాలిడ్ ప్లేస్ సంపాదించి పెట్టాలనే ఆలోచనలతో సతమతమవుతున్నాడు విక్రమ్.
అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధృవ్ విక్రమ్. ఈ సినిమాతో ధృవ్ కి ఫుల్ క్రేజ్ వస్తుందనీ.. విజయ్ దేవరకొండలా యూత్ కి కనెక్ట్ అవుతాడని ఎక్స్ పెక్ట్ చేశాడు విక్రమ్. అందుకే బాలా సినిమా మొత్తం పూర్తి చేసినా తనకు నచ్చినట్టు రాలేదనీ.. బాలాని తప్పించి అర్జున్ రెడ్డికి అసోసియేట్ గా పనిచేసిన గిరీషియాని డైరెక్ట్ గా తీసుకున్నాడు విక్రమ్.
హీరోయిన్ ని చేంజ్ చేసినా.. డైరెక్టర్ ని మార్చి.. సూపర్ విజన్ చేసినా ఆదిత్య వర్మ సూపర్ హిట్ కాలేదు. బ్లాక్ బస్టర్ ఎంట్రీ దొరకలేదు. దీంతో కొడుకు కెరీర్ ను గట్టెక్కించేందుకు ధృవ్ తో కలిసి నటించాలని ప్లాన్ చేస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విక్రమ్, ధృవ్ ఇద్దరూ కలిసి నటించబోతున్నారు.
మొత్తానికి విలక్షణ నటుడు విక్రమ్ తన కొడుకు ధృవ్ కెరీర్ పై బాగా ఫోకస్ చేస్తున్నాడు. ఎలాగైనా తన కుమారుడికి ఒక మంచి హిట్ ఇచ్చేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగాడు.