
అమ్మ కుట్టి అమ్మ కుట్టిలో ఈ వయస్సులోనూ కుర్చీ స్టెప్పుతో కుమ్మేసిన బాలయ్య..!
యువరత్న నందమూరి బాలకృష్ణ డ్యాన్సులు చేసే విషయంలో ముందు నుంచి బాగానే కష్టపడతాడు. బాలయ్యకు కాస్త బాడీ ఎక్కువే అయినా ఆయన పాటలకు హీరోయిన్లతో పోటీ పడి వేసే స్టెప్పులు మాత్రం అదర గొడతాయి. సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు సినిమాల్లో బాలయ్య వేసిన స్టెప్పులు ఓ రేంజ్‌లో ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హెవీ బాడీ మీద బాలయ్య ఎంత సింపుల్ గా స్టెప్పులు వేసినా తెరమీద చూసేందుకు చాలా బాగుంటాయి. చెన్నకేశవరెడ్డి సినిమాలో శ్రీ కృష్ణుడు స్టెప్ వేసి ఔరా అనిపించాడు.
ఇక గొప్పింటి అల్లుడు, భలేవాడివి బాసు , పలనాటి బ్రహ్మనాయుడు లాంటి సినిమాల్లోనూ తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి మెప్పించాడు. అయితే ఇటీవల ఆరు పదుల వయస్సుకు చేరువ అయిన బాలయ్య ఈ వయస్సులోనూ మంచి స్టెప్పులు వేస్తూ తనలో డ్యాన్స్ గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. 2018లో సంక్రాంతి కానుకగా వచ్చిన జై సింహా సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో బాలయ్య హీరోయిన్ నటా షా దోషీతో కలిసి అమ్మ కుట్టి అమ్మ కుట్టి పాటకు వేసిన స్టెప్పులు హైలెట్ అయ్యాయి.
హీరోయిన్ బాడీపై వంగి స్టెప్ వేసిన బాలయ్య చొక్కా జిప్ తీస్తూ వెనక్కు నడుచు కుంటూ వెళ్లిన స్టెప్ హైలెట్. ఆ తర్వాత సిగరెట్ వెలిగించి కుర్చీని ముందుకు జరుపుతూ వేసిన స్టెప్పుకు థియేటర్లలో కంటిన్యూగా విజిల్స్ పడ్డాయి. 58 ఏళ్లలో బాలయ్య వేసిన ఈ స్టెప్ ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడిని ఉర్రూత లూగించేసింది.