హెరాల్డ్ స్పెషల్ JUNE 2020 : బిబి-3 టీజర్ తో గర్జించిన బాలయ్య..!

shami

సినిమాల రిలీజ్ సంగతి అటుంచితే దాదాపు రెండున్నర నెలల లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాలకు సంబందించిన టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ నెలలో వచ్చిన క్రేజీ టీజర్ బిబి3. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ టీజర్ లో బాలకృష్ణ పంచెకట్టు లుక్కు.. డైలాగ్ కిక్కు రెండు అదిరిపోయాయి. సిం హా, లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కలిసి చేస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

 

ఇక ఈ టీజర్ లో తన మార్క్ డైలాగ్ తో అలరించాడు బాలయ్య బాబు. శతృవులకు వార్నింగ్ ఇవ్వడంలో బాలకృష్ణ రూటే సెపరేటు. ఇక బోయపాటి డైరక్షన్ లో చేసే రివెంజ్ డ్రామా సినిమాల్లో మాత్రం డైలాగులు అదిరిపోతాయి. ఈ నెలలో రిలీజైన టీజర్ లలో బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న బిబి3 కి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది.

 

సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనిపిస్తాడని అంటున్నారు. దానికోసమే బాలయ్య బాబు విగ్ లేకుండా తన ఒరిజినల్ లుక్ ను రివీల్ చేశాడు. మొత్తానికి బాలకృష్ణ, బోయపాటి మరో సంచలనానికి సిద్ధమయ్యారని చెప్పొచ్చు. సినిమాకు ఏర్పడిన అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటే మాత్రం ఈసారి బాలయ్య బాబు సత్తా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపించాలని రెడీగా ఉన్నారు నందమూరి అభిమానులు.                     

" height='150' width='250' src="https://www.youtube.com/embed/Ch9TLXI3bHU" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: