స్నేహితుడు గురుంచి ప్రియా వారియర్ భావోద్వేగ పోస్ట్..!

Suma Kallamadi

ఒకే ఒక కన్నుగీటుతో కుర్రకారును తనవైపుకు తిప్పుకుంది యువ కథానాయిక ప్రియా ప్రకాష్​ వారియర్​. అప్పటి నుంచి ఆమెకు విశేష ప్రేక్షకాదరణ దక్కుతోంది. తాజాగా ప్రియ ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియోను షేర్​ చేసింది. అందులో తన స్నేహితుడైన నకుల్​తో కనిపించిందీ నటి. చేసిన ఒక్క సినిమా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చి పెట్టింది. కొన్ని సినిమాలలో డైలాగులు, భావోద్వేగ మాటలు, పాటలు బాగా ప్రాచుర్యం లోకి వస్తాయి. కానీ  ఈ కథానాయక విషయం లోకి వస్తే కేవలం ఒకే ఒక ముద్దు తో యువత మదిని గెలుచుకొని సినిమా ను అనేక బాషలలో రీమేక్ చేసి హిట్ కొట్టారు.

ఒక భాషలో కాదు... రిలీజ్ చేసిన ప్రతి భాషలోనూ హిట్ టాక్ రాకెట్ల ముందుకు దూసుకుపోయింది.. అదే సమయంలో సిఆర్పీఎఫ్ జవాన్ల మీద పుల్వామాలో దాడి జరిగింది. అప్పుడు ఆ దాడి కన్నాసినిమా ప్రమోషన్ ఎక్కువవడంతో కొంతమేరకు రెండు విషయాలను అక్క పక్కన పెట్టి ఎందుకింత పిలుపునిస్తున్నారు నేను ఒక వాదన కూడా మొదలైంది. అది కూడా సినిమాకు ఓ ప్రమోషన్ గా మారిపోయింది. చెడు లో కూడా ఆ సినిమాకు ప్రమోషన్ లా మారిపోయింది.

యువ కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్​ తన ఇన్​స్టాగ్రామ్​లో తాజాగా ఓ వీడియో షేర్​ చేసింది. అందులో ఇటీవలే కారు ప్రమాదంలో గాయపడిన తన స్నేహితుడైన నకుల్ థంపి చేతిని నిమురుతూ ఓదారుస్తోంది. డాన్సర్​గా గుర్తింపు పొంది ఇటీవలే నటుడిగా మారాడు నకుల్​. 

"నకుల్​ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. అతడి గురించి ఆలోచిస్తున్న శ్రేయోభిలాషులందరికీ నకుల్​ తన ప్రేమను, కృతజ్ఞతను తెలియజేశాడు" అని పోస్టు చేసింది ప్రియా వారియర్​. నకుల్​ పుట్టినరోజు సందర్భంగా ప్రియ​ ఇటీవలే ఓ భావోద్వేగ పోస్టును షేర్​ చేసింది. వారిద్దరిదీ బలమైన స్నేహమని అందులో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: