ఇది మనల్ని మళ్ళీ కలుపుతుంది.. ఇర్ఫాన్ భార్య భావోద్వేగం..?

praveen

ఇటీవలే బాలీవుడ్ దిగ్గజ నటుడైన ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మృతి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో పెట్టిన విషయం తెలిసిందే. లెజెండరీ నటుడిని కోల్పోవడంతో  అటు అభిమానుల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే బాలీవుడ్ దివంగత నటుడు అయిన ఇర్ఫాన్ ఖాన్ భార్య ఇర్ఫాన్ ను  గుర్తుచేసుకుంటూ పలు వ్యాఖ్యలు చేసింది. తన భర్త ఇర్ఫాన్ ఖాన్ కు వర్షం కలువపూలు అంటే ఎంతో ఇష్టం అంటూ ఆయన భార్య సుతాపా  తెలిపింది. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయగ ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. 

 కలువ పువ్వుల కోసం సృష్టించిన లోటస్ పాండ్ ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాప భావోద్వేగ  పూరితమైన ఒక లేఖను  పంచుకున్నారు. ఈ కలువ పువ్వులు మిమ్మల్ని  గుర్తుచేస్తున్నాయి  ఇర్ఫాన్... ఈ కలువపూలు వికసించేలా చేయడానికి మీరు ఎంతగా పరితపించారో  నాతో పాటు అవి కూడా చూశాయి... ఎండిపోతున్న కలువ పువ్వులంజ్  తీసుకొచ్చి  వాటి కోసం పాండు నిర్మించడానికి ఎంత కష్టపడ్డారో  అంటూ ఇర్ఫాన్ భార్య లేఖలో రాసుకొచ్చారు . ఇక మరో పోస్టులో  వర్షం పడుతున్న వీడియో ని కూడా పోస్ట్ చేశారు. 


 వర్షానికి సంబంధించిన ఫోటో పోస్ట్ చేస్తూ మీకు ధన్యవాదాలు ఇర్ఫాన్... ఈ చినుకుల శబ్దంలో నేను మిమ్మల్ని విన్నాను... ఇది నీకు నాకు మధ్య వారధి అని నాకు తెలుసు. ఇది నా ఆత్మను శరీరాన్ని తాకింది. రెండు లోకాల్లో ఉన్న ఇద్దరిని ఈ వర్షం ఎప్పుడు కలుపుతూనే ఉంటుంది అంటూ భావోద్వేగ పూరితమైన పోస్ట్ పెట్టారు ఇర్ఫాన్ భార్య సుతాప. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి... అటు అభిమానులు  కూడా ఇర్ఫాన్ ఖాన్  జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: