నవ్వుల గులాబీ రోజా అంటే ఇష్టం లేనివారు ఉంటారా..

Satvika

రోజా.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల లో నటించి స్టార్ హీరోయిన్ గా తన పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. అందుకే ఇప్పటికి రోజా సినిమాల కోసం ఎగబడుతున్నారు. చిన్న వయసులోనే సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక స్టార్ హీరోలు అందరి తో వరుసగా సినిమాలు చేసి మంచి హిట్స్ కొట్టి అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రోజా. ఆమె అందం, నటన, ఆమె చిరునవ్వు తెలుగు ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంది. అందుకే రోజాను నవ్వుల గులాబీ అని ముద్దగా పిలుచుకుంటారు. 

 

 

సినిమా కెరియర్లో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన ఈ అందాల బొమ్మ.. వ్యక్తిగత జీవితంలో తమిళ దర్శకుడు సెల్వామణి ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. అతన్ని ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమె హీరోయిన్ గా కాకుండా  సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. అగ్ర హీరోయిన్ అయినా సరే ఎలాంటి పాత్ర అయినా సరే కథ డిమాండ్ చేస్తే మాత్రం ఆమె కచ్చితంగా చేస్తారు అనే పేరు మాత్రం టాలీవుడ్ లో ఉంది. పెళ్లి అయిన తర్వాత భర్త ప్రోత్సాహం తో ఆమె మరింత అందంగా నటించే ప్రయత్నం చేసారు. 

 

 

ఇప్పుడు సినిమాలనే కాదు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. నగిరి ఎమ్మెల్ల్యే గా ప్రజల్లో మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె మైకు పట్టుకుందంటే అవతలి  రాజకీయ నాయకుడు గజ గజ వణకాల్సిందే.. ఇకపోతే బహుముఖ ప్రజ్ఞాశాలి గా రోజా కొనసాగుతున్నారు. రాజకీయ నాయకురాలుగా, నటిగానే కాకుండా ఈటీవీ లో ప్రసారమవుతున్న నవ్వుల షో జబర్దస్త్ లో కూడా జడ్జీగా రాణిస్తున్నారు. పెళ్లి తర్వాత ఆమె స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: