ఆ సూపర్ హిట్ సీక్వల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ.. అదిరిపోయే ప్లాన్..!
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలకృష్ణ ప్రతి సినిమాలో మోక్షజ్ఞ గెస్ట్ అప్పియరెన్స్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నుండి ఈ వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ 106వ సినిమా బోయపాటి శ్రీను డైరక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపిస్తారట. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ ఉంటాడని చెప్పట్లేదు కాని మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై మళ్లీ హంగామా మొదలైంది.
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ కూడా ఫ్యాన్స్ ను ఉత్సాహపరచే వ్యాఖ్యలే చేశాడు. ఇదిలాఉంటే రైటర్ సాయి మాధవ్ బుర్ర డైరక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే అది కూడా బాలయ్య బాబు సూపర్ హిట్ మూఒవీ ఆదిత్య 369 సీక్వల్ తో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని టాక్. కొన్నాళ్లుగా ఆదిత్య 369 సీక్వల్ ప్రయత్నాలు జరుగుతున్నా అది వర్క్ అవుట్ అవడం లేదు. సాయి మాధవ్ బుర్ర చెప్పిన కథ నచ్చడంతో బాలయ్య బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.
ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో బాలకృష్ణ కూడా నటిస్తారట. బాలకృష్ణ, మోక్షజ్ఞ మల్టీస్టారర్ గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకునే అవకాశం ఉంది. ఎన్.టి.ఆర్ మనవడు నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.