ఆ హీరోయిన్ పొట్టి డ్రెస్సులు వేస్తే అస్సలు చూడలేమేమో..?

praveen

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ స్కిన్ షో కి దూరంగా ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. తమ  నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుని.. వరుస అవకాశాలను అందుకుని  తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ లలో ఒకరు నిత్యామీనన్. అలా మొదలైంది సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది నిత్యామీనన్. అయితే నిత్య మీనన్ నటన కి ఫిదా అవని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటివరకూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించి తనను అభిమానించేలా చేసుకునేది నిత్య మీనన్. 

 

ఇప్పటి వరకు  ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన నిత్యామీనన్ స్కిన్ షోకి మాత్రం పూర్తిగా దూరంగా ఉంది అనే చెప్పాలి. ఎక్కడ అందాల ఆరబోత ఉన్న పాత్రలు చేయలేదు ఈ అమ్మడు. అదే సమయంలో తన అభినయంతో ఎంతోమందిని  ఆకట్టుకుంది అనే చెప్పాలి. అయితే ఓ వైపు అందాలు ఆరబోస్తున్న హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో హవా నడుస్తున్నప్పటికీ ... ఈ అమ్మడు మాత్రం అందాల ఆరబోతకు  ఎక్కడ తావు ఇవ్వకుండా  కేవలం నటనతోనే హాట్ హీరోయిన్ లకు  సైతం పోటీ ఇచ్చింది. 

 


 దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో నిత్య మీనన్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. అంతే కాకుండా అటు తెలుగు ప్రేక్షకులు కూడా నిత్యా మీనన్ ని పొట్టి  డ్రెస్లో చూడటానికి ఇష్టపడరు కూడా . ఎందుకంటే నటన విషయంలో నిత్యామీనన్ ఎంతో గొప్ప నటి... ఫిజిక్ విషయంలో కాస్త బొద్దుగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకునే  హీరోయిన్లు జిమ్ లో   ఎంతలా కసరత్తులు చేసి బాడీషేప్ మెయింటెన్ చేస్తారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి వాటికి దూరంగా ఉండే నిత్యామీనన్ పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తే ప్రేక్షకులు చూడలేరేమో .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: