మాధవీలతతో తారక రత్న

Prasad
నందమూరి తారకరత్న వరసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మరో సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పార్గవన్ దర్శకత్వంలో ‘చూడాలని చెప్పాలని’ పేరుతో రూపొందుతున్న సినిమాలో తారక రత్న హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక రత్నకు జోడిగా మాధవీలత నటిస్తోంది. ఈ చూడాలని చెప్పాలని సినిమా షూటింగ్ సోమవారం నాడు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి రామానాయడు క్లాప్ ఇవ్వగా, ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. కాగా, ఈ చూడాలని చెప్పాలని సినిమాను నాగమళ్ళ శంకర్ నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: