ఎన్టీఆర్, షారుఖ్ కాదు మళ్ళీ ఆ స్టార్ హీరోతోనే అట్లీ..!
కోలీవుడ్ యువ సెన్సేషన్ డైరక్టర్ అట్లీ కేవలం విజయ్ తోనే సినిమాలు చేయాలని అనుకున్నాడో ఏమో కానీ అతని కొత్త సినిమా అప్డేట్ ప్రేక్షకులను షాక్ అయ్యేలా చేస్తుంది. తేరి, మెర్సల్, బిగిల్ మూడు సినిమాలు విజయ్ తో చేసిన అట్లీ నాలుగవ సినిమాను కూడా ఆ స్టార్ హీరోతోనే చేయబోతున్నాడని తెలుస్తుంది. ఓ పక్క టాలీవుడ్ లో ఎన్టీఆర్, బాలీవుడ్ షారుఖ్ ఖాన్ తో అట్లీ సినిమా అంటూ వార్తలు రాగా వాటినన్నిటిని పక్కన నెట్టేసి విజయ్ తోనే మరో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు అట్లీ.
ప్రస్తుతం విజయ్ మురుగదాస్ డైరక్షన్ లో తుపాకీ 2 సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అట్లీ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా 300 కోట్లు దాకా ఉంటుందని అంటున్నారు. అట్లీ, విజయ్ సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కాంబో సినిమా అంటే కోట్లు వసూళ్లు రాబట్టడం ఖాయం. బిగిల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా హాట్ న్యూస్ గా మారిన అట్లీ ఏకంగా షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. తన దగ్గర ఉన్న ఒకటి రెండు లైన్లు షారుఖ్ కు వినిపించాడు అట్లీ. కానీ ఎందుకో ఆ కాంబో సెట్ అవలేదు.
ఇక టాలీవుడ్ క్రేజీ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా అట్లీ సినిమా అని హడావిడి చేశారు. అక్కడ విజయ్ రేంజ్ కు తెలుగులో ఏమాత్రం తీసిపోని క్రేజ్ ఉన్న స్టార్ ఎన్టీఆర్ అందుకే అట్లీ ఇక్కడ ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేశాడు. కానీ తారక్ కు చెప్పిన లైన్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాదని డిస్కషన్ లోకి రావడంతో అదే కథతో విజయ్ ను హీరోగా పెట్టి చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎన్టీఆర్, షారుఖ్ కాదన్న ఈ సినిమాతో విజయ్ హిట్టు కొడతాడో లేదో చూడాలి.