
ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది..?
తెలుగోడి గౌరవాన్ని కాపాడి... తెలుగువారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి సాధ్యం కానంత ఖ్యాతిని సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో మాత్రమే కాదు అతను ఒక కారణజన్ముడు అనేంతలా ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. ముఖ్యంగా కృష్ణుడు రాముడు అంటే నందమూరి తారక రామారావు లాగే ఉంటారేమో అని ప్రేక్షకులను ప్రభావితం చేశాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి సాధ్యం కాని చరిత్రని సృష్టించారు నందమూరి తారక రామారావు. ఆయన తెలుగు ప్రజలకు దూరమైన ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు.
అయితే ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో కీలక మలుపులు... ఎన్నో ఊహించని ఘటన లు ఉన్న విషయం తెలిసిందే. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందే నందమూరి తారక రామారావు బసవతారకం ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఏకంగా తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. ఇక బసవతారకం పిల్లల బాగోగులు చూస్తూ ఉంటే నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో ఖ్యాతిని సంపాదించారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన గా నిలిచారు. అయితే నందమూరి తారక రామారావు... తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత లక్ష్మీపార్వతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే అప్పటికే ఎంతో మంది గొప్ప గొప్ప అందగత్తెలు అయిన హీరోయిన్లతో నటించిన ఒక సాధారణ మహిళ ను నందమూరి తారక రామారావు రెండో వివాహం చేసుకోవడంతో అది పెద్ద సంచలనం గానే మారిపోయింది. ఇక ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతికి కూడా అంతకు ముందే వేరే పెళ్ళి జరగడం కూడా మరింత సంచలనంగా మారిపోయింది. అయితే వృద్ధ వయసులో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం కారణంగానే లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది అని ఎన్నో ఏళ్ల నుంచి ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంటుంది. అప్పటికే వృద్ధ వయసులో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేకుండా ఉన్న ఎన్టీఆర్ ఒక తోడు కోసం లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు అని చెబుతూ ఉంటారు.