సెంటిమెంట్ తో కొట్టబోతున్న మెగా మేనళ్లుడు..!
మెగా మేనల్లుడు సాయి తేజ్ వరుసగా ఆరు సినిమాల ఫెయిల్యూర్ తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఆ సినిమా తర్వాత ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో సత్తా చాటిన సాయి తేజ్ లేటెస్ట్ గా సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా మొదటి సాంగ్ రంజాన్ సందర్భంగా రిలీజై మంచి ఆదరణ తెచ్చుకుంది.
ప్రేమంటే అసలు పడని.. పెళ్లంటే దూరంగా జరిగే ఓ సోలో లైఫ్ అబ్బాయి కథే ఈ సినిమా. నూతన దర్శకుడు సుబ్బు ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడట. అంతేకాదు సినిమాలో మదర్ సెంటిమెంట్ బాగా ఉంటుందట. సో మెగా హీరో మదర్ సెంటిమెంట్ తో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. సెంటిమెంట్ కరెక్ట్ పండాలే కానీ అసలు సెంటిమెట్ సినిమాల రేంజ్ ఏ సినిమా ఆడుతుంది చెప్పండి. బుల్లితెర ప్రేక్షకులను సైతం థియేటర్ వైపు తెప్పించే సత్తా కేవలం సెంటిమెంట్ సినిమాలకే ఉంది. అందుకే సాయి తేజ్ ఈ సినిమాకు ఓకే చెప్పాడట. సినిమా అవుట్ ఫుట్ కూడా బాగానే వచ్చినట్టు చెబుతున్నారు.
ఈ సినిమా తర్వాత సాయి తేజ్ దేవా కట్ట డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. సోలో బ్రతుకే సో బెటర్ యూత్ కమ్ సెంటిమెంట్ మూవీగా వస్తుండగా ప్రస్థానం రేంజ్ లో దేవా కట్ట మరో అద్భుతమైన కథతో వస్తున్నాడని అంటున్నారు. మొత్తానికి సాయి తేజ్ కెరియర్ మళ్ళీ గాడిలో పడినట్టే అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు కూడా హిట్టు పడితే మాత్రం మెగా మేనళ్లుడికి తిరుగు ఉండదని చెప్పొచ్చు.