ఎన్టీఆర్ బర్త్ డే... ట్విట్టర్ లో ట్రెండింగ్.. ఆల్ టైమ్ రికార్డ్..?
నందమూరి నట వారసుడు ప్రేక్షకుల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో మంది ప్రముఖులు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 24 గంటల్లోనే ఒక కోటి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అభిమానులు సినీ ప్రేక్షకులు ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ట్విట్టర్లో ఇలా 24 గంటల్లో కోటి విషెస్ రావడం ఆల్ టైమ్ ట్విట్టర్ రికార్డ్ హిస్టరీ. మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ కు 10 మిలియన్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇక ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా జూనియర్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది... సూపర్ టాలెంటెడ్ సూపర్ ఎనర్జిటిక్ తారక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు... మీకెప్పుడు మంచి ఆశీర్వాదాలు ఉంటాయి... భవిష్యత్తులో మీకు చాలా ఆనందం ప్రేమ మరియు విజయం రావాలని కోరుకుంటున్నాను అంటూ రాశిఖన్నా జూనియర్ ఎన్టీఆర్కు విష్ చేసింది. కాగా ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ పాటలు వినిపిస్తున్నాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది.
ఇక అభిమానులైతే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకొంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్ కు సంబంధించిన అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ... అభిమానులకు నిరాశే ఎదురయింది. ఇక దీని వివరిస్తూ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు వివరణ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సంబరాలు ఆల్రెడీ మొదలు పెట్టారు అభిమానులు. అంతేకాకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
TrendSetting 1 Crore Mentions on @tarak9999 in last 24 Hrs
All Time Record In indian twitter history
First 10M Mentions Record#HappyBirthdayNTR pic.twitter.com/FHpcwefLXc — ntr Fans (@NTR2NTRFans) May 20, 2020Happy birthday to the super talented and super energetic @tarak9999 🤗
May you be showered with the choicest blessings.. Wish you loads of happiness, love and success.. 🤗#HappyBirthdayNTR — Raashi (@RaashiKhanna) May 20, 2020