మహేష్ బాబు పోకిరి సినిమా చూస్తుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసా..?!

Suma Kallamadi

ప్రిన్స్ మహేష్ బాబు జీవితం లో పోకిరి ఒక గొప్ప చిత్రమని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఫుల్ లెన్త్ యాక్షన్ హీరోగా మహేష్ బాబు చూపించిన నటనా చాతుర్యం తెలుగు ప్రేక్షకులందరినీ ఎంతో మెప్పించింది. ఈ చిత్రంలో క్లైమాక్స్ చేసే సన్నివేశంలో రివీల్ చేసే ఒక విషయం అందరికీ దిమ్మతిరిగే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు, మహేష్ బాబు నేను చూపించిన శైలి ఎప్పటికీ అందరి మెదళ్ళలో మెదులుతూనే ఉంటుంది. 2006 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం రెండు గంటల 48 నిమిషాల పాటు కొనసాగగా... ఏ సన్నివేశం కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టించదు. అందుకే సినీ పరిశ్రమలో ఏకంగా వెయ్యి రోజులు ఆడిన ఏకైక చిత్రంగా రికార్డులు సృష్టించింది. మగధీర సినిమా వరకూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక డబ్బులను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన సినిమాగా పోకిరి నిలిచింది.


పూరి జగన్నాథ్ మొదటిలో ఈ చిత్రం యొక్క కథను పవన్ కళ్యాణ్ వినిపించగా... అతడు రిజెక్ట్ చేశాడు. దాంతో రవితేజ తో ఈ సినిమాని చేద్దాం అనుకున్నాడు కానీ రవితేజ అప్పటికే చాలా బిజీ షెడ్యూల్లో కూరుకుపోయాడు. చివరికి మహేష్ బాబుకు ఈ కథ వినిపించగా అతను ఓకే చెప్పి నటించాడు. నిజానికి మహేష్ బాబుకు కథ నచ్చిన పాట సినిమా పేరు మాత్రం నచ్చలేదు. ఉత్తమ సింగ్ సన్నాఫ్ సత్యనారాయణ అనే పేరును ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ అనుకున్నాడు. అయితే మహేష్ బాబు అని తనకు వేరొక పేరు కావాలి అని చెప్పడంతో లేదా పోకిరి ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయమని చెప్పగా... మహేష్ బాబు పోకిరి శీర్షికను సెలెక్ట్ చేశాడు.


సినిమా కథ గురించి చెప్పుకుంటే... పండు అనే ఒక మాఫియా రౌడీ ముసుగులో ఉన్న పోలీసు అధికారి... ఎవరైతే ఇతరులను అన్యాయంగా వేలెత్తి చంపేస్తారు వారిని అంతమోదిస్తుంటాడు. అలీ భాయ్ అనే మాఫియా గ్రూప్ లో చేరి వారు చేసే నేరాలకు చెక్ పెడతాడు. ఇంతదా మొదటి నుంచి వచ్చిన ప్రేక్షకులకు ఊహించ లేని రీతిలో ఉంటుంది. నిజంగానే పండు ఒక పోకిరీ ఆకతాయి పని పాట లేని వ్యక్తి అని ప్రేక్షకులను బాగా నమ్మిస్తాడు పూరి జగన్నాథ్. కానీ ఎప్పుడైతే అతను పోలీసు అధికారి అని ప్రేక్షకులకు తెలుస్తుందో... అక్కడి నుండి సినిమా సూపర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ సినిమాని చూడకపోతే తప్పకుండా చూడవలసిందిగా మేము సజెస్ట్ చేస్తున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: