సూపర్ స్టార్ తో 'మహర్షి' స్మృతులను గుర్తు చేసుకున్న దేవిశ్రీప్రసాద్....!!

GVK Writings

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గత ఏడాది ప్రేక్షుకుల ముందుకు వచ్చిన సినిమా మహర్షి. సరిగ్గా గత ఏడాది ఇదే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు కురవడంతో పాటు బాగా కలెక్షన్స్ దక్కాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై ఎంతో భారీగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించగా, ప్రముఖ కమెడీ హీరో అల్లరి నరేష్, మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించడం జరిగింది. 

 

మహేష్ బాబు రిషి అనే పవర్ఫుల్ పాత్రలో నటించడంతో పాటు మంచి కమర్షియల్ హంగులు, హృదయానికి హత్తుకునే హృద్యమైన మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా మంచి పేరు సంపాదించింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుండి దాదాపుగా చాలా ఏరియాల్లో మంచి రికార్డ్స్ నెలకొల్పిన ఈ సినిమా, మహేష్ బాబు కెరీర్ 25వ సినిమాగా తెరకెక్కడం విశేషం. ఇకపోతే ముఖ్యంగా సినిమాలోని ఇదే కదా, పదరా పదరా, పాల పిట్ట సాంగ్స్ శ్రోతలను విశేషంగా అలరించడంతో పాటు థియేటర్స్ లో కూడా ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందనను రాబట్టడం జరిగింది. 

 

కాగా ఈ సినిమా నిన్నటితో సక్సెస్ఫుల్ గా ఏడాది పూర్తి చేసుకోవడంతో సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఆ సినిమాలోని పాల పిట్ట సాంగ్ కంపోజింగ్ సమయంలో మహేష్ బాబు, సితార, గౌతమ్ లతో కలిసి సరదాగా షూట్ చేసిన ఒక వీడియో ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. తమ సినిమా సక్సెస్ఫుల్ గా ఏడాది పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, మహేష్ బాబు గారి సినిమాలకు సంగీతం అందించడం ఎంతో ఆనందంగా ఉంటుందని, తోటి కళాకారులని మహేష్ బాబు ఎంతో అభిమానించడంతో పాటు అనుక్షణం వారి భుజం తట్టి ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారని, భవిష్యత్తులో ఆయనతో మరిన్ని సినిమాలు కలిసి పనిచేయాలని కోరుకుంటూ దేవిశ్రీ తన పోస్ట్ లో తెలిపారు.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: