జేజమ్మకు 3 మిలియన్ల ఫాలోవర్స్ ...!
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకత సొంతం చేసుకున్న అందాల నటి స్వీటీ అలియాస్ అనుష్క. సూపర్ సినిమా నుంచి సింగం సినిమా వరకూ, అరుంధతి నుంచి రుద్రమదేవి సినిమా వరకూ ... క్యారెక్టర్ అయినా కూడా తాను తప్ప ఇంకా ఎవరు ఆ క్యారెక్టర్ చేయలేనంత రీతిగా అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాకుండా అరుంధతి, సైజ్ జీరో, భాగమతి సినిమా వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అనుష్క తన సత్తా ప్రేక్షకుల ముందుకు చాటుకుంది.
ఇక అనుష్క విభిన్న పాత్రలు చేస్తూ... అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా కూడా ఇంస్టాగ్రామ్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ కు చేరుకుంది. ఏది ఏమైనా కానీ 3 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం అంటే విశేషం అని చెప్పాలి. ఇక తాజాగా అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలో పెయింటింగ్ వేస్తున్న ఫోటో అభిమానులతో షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది. అంతేకాకుండా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఉండాలని అభిమానులను కోరడం జరిగింది. అంతేకాకుండా మీ ప్రేమకు అభిమానానికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది.
ఇక ప్రస్తుతం అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి మూగదానిలా పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఇక సినిమా టైటిల్ ఈ తగ్గట్టుగానే ఒక సైలెంట్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా అనంతరం స్వీటీ, పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపించాయి. చూడాలి అది ఎంతవరకు కరెక్టో...!