అడవి శేష్ లాంటి హీరో ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉండాల్సిందేనయ్యా ..మహేష్ బాబు మామూలోడు కాదు ..!

frame అడవి శేష్ లాంటి హీరో ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉండాల్సిందేనయ్యా ..మహేష్ బాబు మామూలోడు కాదు ..!

Kunchala Govind

టాలీవుడ్ లో దాదాపు హీరోలందరు తమ వాళ్ళ సపోర్ట్ తోనే సక్సస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. అప్పట్లో చిరంజీవి ఇండస్ట్రీకొచ్చి ఎవరి అండదండలు లేకుండానే ఈ స్థాయికొచ్చారు. ఆ తర్వాత రవితేజ, నాని కూడా అంతే. అయితే ఆ లిస్ట్ లో మరో హీరో కూడా చేరాడు. అతనే అడవి శేష్. ఈ యంగ్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకొచ్చి చాలా ఏళ్ళైనప్పటికి ఈ రెండు మూడేళ్ళుగానే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకున్నాడు. 

 

అడవి శేష్ లో ఒక ప్రత్యేకత ఉంది. అదే తను అందరి హీరోల మాదిరిగా మాస్ హీరో అవ్వాలన్న అత్యుత్సాహం చూపించకపోవడం. అంతేకాదు రెగ్యులర్ కథలతో సినిమాలు చేయకపోవడం. చెప్పాలంటే కథల విషయంలో తన పంథానే వేరు. ప్రస్తుతం ఉన్న ఏ హీరోలాగా ఆలోచించడు. కంప్లీట్ గా హాలీవుడ్ స్టైల్లో స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకుంటాడు.

 

అంతేకాదు ఇప్పుడున్న కొందరు యంగ్ హీరోలతో పొల్చుకుంటే అడవి శేష్ చేస్తున్న సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉందన్న విషయం ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. మల్టీ టాలెంటెడ్ అయిన అడవి శేష్ కి కథ స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ ఉంది. అందుకు ఉదాహరణ శేష్ హీరోగా నటించిన 'క్షణం' 'గూఢచారి' 'ఎవరు' సినిమాలే.

 

ఇక అడవి శేష్ నటించిన 'గూఢచారి' సినిమాకి సీక్వెల్ తీస్తానని శేష్ అప్పట్లోనే ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అడవి శేష్ 'గూఢచారి 2' స్క్రిప్ట్ వర్క్ రెడీ చేస్తున్నాడట. అడవి శేష్ ప్రస్తుతం 'మేజర్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ కంప్లీటయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉంది. శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

26/11 ముంబై ఘటనలో వీర మరణం చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అడవి శేష్ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. అందుకే అడవి శేష్ లాంటి హీరో ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉండాల్సిందేనని ..అడవి శేష్ తో మహేష్ బాబు సినిమా నిర్మిస్తున్నారంటే మామూలోడు కాదు అంటున్నారు..!    

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: