ట్విట్టర్ ట్రెండింగ్ లో 'పుష్ప'.. టాప్ లేపుతుందిగా..!

shami

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న మూవీ  పుష్ప. కొన్నాళ్లుగా వినిపిస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతోనే సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ అల్లు ఆర్మీనే కాదు మెగా ఫ్యాన్స్ ను ఫుల్ జోష్ నిండేలా చేశాయి. ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ మూవీగా వస్తున్న పుష్ప సినిమాతో సంచలనం సృష్టించాలని ఫిక్స్ అయ్యారు సుకుమార్, బన్నీ. 

 

అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ టోన్ బొమ్మ రీ సౌండ్ ఎలా ఉంటుందో చూపించేలా షేక్ చేస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ తో కన్పిస్తున్నాడు. ఈరోజు బన్ని బర్త్ డే కావడం అందులో కొత్త సినిమా పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో ట్విట్టర్ ట్రేండింగ్ లో టాప్ లేపేస్తుంది పుష్ప ఫస్ట్ లుక్. ఈరోజు ట్విట్టర్ లో ట్రేండింగ్ లో ఉన్న యాష్ ట్యాగ్స్ లో పుష్ప టాప్ 2లో ఉంది. హనుమాన్ జయంతి ట్యాగ్స్ మొదటిస్థానంలో ఉండగా అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ లుక్ సెకండ్ ప్లేస్ లో ఉంది. 

 

ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సుకుమార్ మొదటిసారి పాన్ ఇండియా వైడ్ సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా మొదటిసారి 5 భాషల్లో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మలయాళంలో బన్నికి స్టార్ క్రేజ్ ఉంది. ఇప్పుడు నేషనల్ వైడ్ గా దుమ్ముదులిపేందుకు సిద్ధమయ్యాడు అల్లు అర్జున్. ఉదయం 9 గంటలకు పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా 179. 5 కె ట్వీట్స్ తో ట్రేండింగ్ లో ఉన్నాడు అల్లు అర్జున్. 

 

పుష్ప  రాజ్ గా అల్లు అర్జున్ తనలోని మరో యాంగిల్ చూపించేలా ఉన్నాడు. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడం.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా అనగానే పుష్ప మీద ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో చేరాయి. మరి ఈ సినిమా చేసే రికార్డులు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. 


'

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: