నటుడు రాజా రవీంద్రకు టాలీవుడ్ లో మంచి నటుడిగా పేరుంది. కెరీర్ ప్రారంభంలో హీరోగా కూడా నటించాడు ఆ తర్వాత చాల సినిమాలలో కీలకమైన పాత్రలు కూడ చేశాడు. ఇటీవల ఇతడు నటించిన 'పైసా'లోని పాత్రకు మంచి గుర్తింపు వస్తోంది. విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడాలని ఉంది అని అంటున్నాడు రాజా రవీంద్ర. తన మనసులోని మాటలను వివరించడానికి ఆయన విలేకరుల సమావేశాన్ని కూడ ఏర్పాటు చేశాడు.
ఈ సందర్భంలో రాజా రవీంద్ర మాట్లాడుతూ తాను నటుడిగా కెరీర్‌ను సాగించాలనుకుంటున్నానని, కానీ మధ్యలో వచ్చిన కొంత గ్యాప్‌లో ప్రొడక్షన్ పనులు, నటీనటులకు కాల్షీట్లు కూడా చూసానని దీనితో తాను నిర్మాతను అయ్యానని భావించి చాల మంది దర్శకులు తనకు పాత్రలు ఇవ్వకుండా దూరం పెడుతున్నారని చెపుతూ తనకు నటనకు దూరమయ్యే ఉద్దేశమే లేదు అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు యువ కథానాయకుల సినిమాల్లో అన్న పాత్రలు, హీరోయిన్ తండ్రి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే సంకేతాలు కూడ ఇచ్చాడు.
తనకు విలన్‌గానూ నటించాలని ఉందని అనే కోరిక కూడ చెప్పాడు. సినిమా రంగంలో సక్సెస్ తప్పనిసరి అని అంటు క్యారక్టర్ ఆర్టిస్టుకైనా అది ముఖ్యం అని అన్నాడు రాజారవీంద్ర. భవిష్యత్తులో టీవీల్లో రియాలిటీ షోలను కూడా నిర్మించాలని ఉంది అని చెపుతున్న రాజారవీంద్రకు మన దర్శక నిర్మాతలు మళ్ళీ ఎంత వరకు అవకాసాలు ఇస్తారో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: