హెరాల్డ్ స్పెషల్ MAR 2020: కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టెప్.. టాలీవుడ్ స్టార్స్ తర్వాతే ఎవరైనా..!

shami

టాలీవుడ్ హీరోల మంచి మనసు మరోసారి అందరికి తెలుస్తుంది. తమ సినిమాలను సూపర్ హిట్ చేసే ప్రేక్షకులకు రిటర్న్ గిఫ్ట్ గా అప్పుడప్పుడు కొన్ని ఆపత్కార సమయాల్లో ఆదుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి టైం లో అందరికంటే ముందు ఉంటారు తెలుగు సినీ స్టార్స్. ఫ్యాన్స్ లేనిదే తాము లేమని చెప్పీ వాళ్ళు ఆ మాటని కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపిస్తుంటారు. ఇలాంటి టైం లోనే స్టార్స్ మీద మరింత గౌరవం పెరుగుతుంది. 

 

కరోనా ఎఫెక్ట్ తో నిరాశ్రయులుగా మారిన సినీ కార్మికులకు అండగా మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు సెలబ్రిటీస్. ఇప్పటికే సీసీసీ అంటూ ఒక ఛారిటీ స్థాపించి విరాళాలు సేకరిస్తున్నారు. ఎవరికీ తోచింది వారు ఇస్తూ సహాయ పడుతున్నారు. అయితే కొందరు డబ్బు రూపంగా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అలా కాకుండా మరికొందరు మాత్రం ప్రస్తుతం ఇలాంటి టైం లో కావాల్సిన అవసరాలను గుర్తించి వాటిని సమకూరుస్తున్నారు.

 

స్టార్స్ మాత్రమే కాదు యువ హీరోలు కూడా ఇలాంటి టైం లో తమ గొప్ప మనసుని చూపిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ తన పరిసర ప్రాంతాల్లో మాస్కులు, శానిటైజర్స్ పంచగా.. మరో యువ హీరో నిఖిల్ కూడా శానిటై్జర్స్, మాస్కుల కిట్స్ అందిస్తున్నారు. నిత్యావసరాలు ముఖ్యమే కానీ ఇలాంటి టైం లో ఇవి చాలా ఉపయోగపడతాయి. ఆపద ఎలాంటిదైనా తమ ప్రేక్షకుల కష్టాల్లో తాము సహాయం చేస్తామని ముందుకొస్తున్న ప్రతి ఒక్క రీల్ హీరోలందరిని రియల్ హీరోస్ అనడంలో తప్పేమి లేదు. సినీ కార్మికులకు అండగా ఏర్పరచిన సీసీసీ చిరంజీవి ఆధ్వర్యంలో ఉంటుంది. వసూలైన మొత్తాన్ని ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు అందచేసేలా పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు. వారి అవసరాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్ చేపడుతున్నారు.  ప్రస్తుతం అందరు స్టార్స్ సీసీసీ కి తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: