పూరి జగన్నాథ్ తో సినిమా తీసేందుకు ఓకే చెప్పిన మహేష్ బాబు..!

Suma Kallamadi

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రం యొక్క విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాస్తవానికి మహేష్ బాబు తీసిన భరత్ అనే నేను, మహర్షి రెండూ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అనే టాక్ ను సంపాదించాయి. దాంతో తాను 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తో హ్యాట్రిక్ కొట్టాడని చెప్పుకోవచ్చు. ఈ వరసలోనే ఇంకొక రెండు హిట్ సినిమాలని తన ఖాతాలో వేసుకోవాలని మహేష్ బాబు తెగ తహతహలాడుతున్నాడట. ఈ క్రమంలోనే చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య లో ఒక కీలకమైన పాత్రలో నటించేందుకు మహేష్ బాబు ని సంప్రదించారట ఆ సినీ బృందం.

అయితే 30 రోజుల డేట్స్ కేటాయించినందుకు... మహేష్ 30 కోట్లు రెమ్యూనరేషన్ గా అడిగారట. కానీ ఆ సినీ బృందం మాత్రం 15 కోట్ల ఇవ్వగలమని చెప్పిందట. దాంతో మహేష్ బాబు ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించలేదట. మరో వైపు వంశీ పైడిపల్లి మహేష్ బాబు కి స్క్రిప్ట్ ని వినిపించగా... అది నచ్చని మహేష్ బాబు స్క్రిప్ట్ లో మార్పులు చేయమని చెప్పారట. ఇక ఆఖరికి మహేష్ బాబు... డైరెక్టర్ పరుశురాం తో సినిమా చేసేందుకు అంగీకరించాడు. అయితే ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా... చిత్రీకరణ కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టగానే ప్రారంభమవుతుంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్న ఈ సమయంలో మహేష్ బాబు ఇంకో మంచి సినిమా వేటలో ఉన్నాడట. ఇందుకు గాను నమ్రతా శిరోద్కర్ కూడా సాయం చేస్తున్నారట. ఆమె పూరి జగన్నాధ్ ఫోన్ చేసి మరీ తన భర్త ఆయనతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పిందట. గతంలో మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో పోకిరి, బిజినెస్ మాన్ చిత్రాలు వచ్చిన విషయం విదితమే. అయితే ఈసారి 'జనగణమన' అనే సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. కొన్ని నెలల కిందట పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... నేను హిట్ సినిమాలు తీస్తున్న సమయంలోనే మహేష్ బాబు నాతో సినిమా తీసేందుకు ఒప్పుకుంటాడు. కానీ ఆ టైంలోనే తనకి ఓకే చెప్పడానికి నాకూ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా! అంటూ మహేష్ బాబు తో తన తదుపరి చిత్రాన్ని తీయనన్నట్టు పరోక్షంగా చెప్పేసారు. కానీ మరి ఏకంగా నమ్రత అడిగేసరికి పూరి ఒప్పుకుంటారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: