అలియా భట్ పై రాజమౌళి ఆలోచనలలో మార్పులు !
‘ఆర్ ఆర్ ఆర్’ ఏ సమయంలో మొదలైందో తెలియదు కాని ఆ మూవీ షూటింగ్ కి అనుక్షణం సమస్యలే. రామ్ చరణ్ జూనియర్ లకు గాయం అవ్వడం దగ్గర నుండి బ్రిటీష్ బ్యూటీ డైసీ ఈ మూవీ నుండి తప్పుకోవడం వరకు ఈ మూవీకి అనేక ఊహించని సమస్యలు ఎదురయ్యాయి.
ఇప్పుడు కరోనా సమస్య వల్ల ఆగిపోయిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ కరోనా సమస్య తీరిన తరువాత కూడ షూటింగ్ మొదలుపెట్టడం కష్ట సాధ్యమా అంటూ ఏకంగా రాజమౌళి కే సందేహాలు కలుగుతున్నట్లు టాక్. దీనికి కారణం అలియా భట్ అని అంటున్నారు.
తెలుస్తున్న సమాచారం మేరకు అలియా భట్ మార్చి రెండవ వారం నుండి ఏప్రిల్ రెండవ వారం వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ కు ఇచ్చిన డేట్స్ అన్నీ కరోనా సమస్య వల్ల వృథా కావడంతో మే జూన్ నెలలలో తాను ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు రాలేనని ఖరాకండిగా చెప్పినట్లు తెలుస్తోంది. తన డేట్స్ అన్నీ ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి అదేవిధంగా మరికొన్ని బాలీవుడ్ సినిమాలకు తన డేట్స్ ఇచ్చేయడంతో ఇప్పుడు అలియా భట్ ‘ఆర్ ఆర్ ఆర్’ వైపు చూడాలి అంటే రాజమౌళిని తన డేట్స్ ను బల్క్ గా తీసుకున్న సంజయ్ లీల భన్సాలీ అనుమతి తీసుకోవలసిందిగా అలియా రాజమౌళిని కోరుతున్నట్లు టాక్.
దీనితో ఇప్పుడు రాజమౌళి సంజయ్ లీలా భన్సాలీ అనుమతి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తూ తన కొడుకు కార్తికేయను ఈమధ్యనే ముంబాయి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీలో అలియా భట్ ను తీసివేసి మరొక హీరోయిన్ ను పెట్టుకుందామని రాజమౌళికి ఆలోచనలు వచ్చినా ఇప్పటికే చరణ్ అలియా భట్ ల మీద ఒక పాటను భారీ సెట్ వేసి తీయడంతో ఆ పాట పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలు కూడ రాజమౌళిని వెంటాడుతున్నట్లు టాక్..