తెరమీదకి మరో దిక్కుమాలిన ఛాలెంజ్.. సోషల్ మీడియాలో వైరల్...?

praveen

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లేనిది కనీసం ఒక్క నిమిషం అయినా ఉండడంలేదు నేటి  జనాలు. సోషల్ మీడియా వల్ల ఎంతగానో ప్రభావితం అవుతున్నారు. ఒక రోజులో 24 గంటలూ సోషల్ మీడియా లోనే గడుపుతున్న వారు కూడా ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతున్నారు. ఇక నెటిజన్లను  ఆకర్షించడానికి ఎన్నో అద్భుతమైన యాప్స్ కూడా తెర మీదకు వస్తున్నాయి. ఇక ఈ యాప్ లు  వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉంటారా చెప్పండి. దీంతో చాలెంజ్ అనే పేరుతో కొత్త పోకడలను తెరమీదికి తెస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకరికొకరు చాలెంజ్ వేసుకోవడం కామన్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నెటిజనుల అందరికీ కొంతమంది చిత్రవిచిత్రమైన ఛాలెంజ్ విసురుతున్నారు. 

 

 

ఇలా కొన్ని ఛాలెంజ్లు ఎంతో ఫేమస్ కూడా అయ్యాయి. ఇక కొన్ని ప్రాణాలకు ప్రమాదకరమైన చాలెంజ్ లు కూడా నెట్టింట్లో ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇలా కొంతమంది చాలెంజ్ లను ట్రై చేసి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకున్న వారు ఉన్నారు. అయితే ప్రాణాలకు హాని చేసే చాలెంజ్ ల  జోలికి వెళ్ళకూడదు అని అటు పోలీసులు కూడా ఎంతో అవగాహన కల్పిస్తున్నప్పటికీ నెటిజన్లు మాత్రం ఎవరి మాట వినడం లేదు. సోషల్ మీడియాలో ఏ కొత్త చాలెంజ్ వస్తే ఆ చాలెంజ్ ప్రయత్నిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక తాజాగా మరో దిక్కుమాలిన ఛాలెంజ్  తెరమీదికి వచ్చింది. 

 

 

 ఇప్పటికే ఎన్నో రకాల ఛాలెంజ్ లు  సోషల్ మీడియాలో హల్ చల్ చేసి  ఎంతో మంది నెటిజన్ల ప్రాణాల మీదికి తెచ్చాయి. ఇక తాజాగా మరో ఛాలెంజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా స్వీడన్ కు చెందిన ఓ యువకుడు సాల్ట్ ఛాలెంజ్ పేరుతో ప్రారంభించిన చాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ చాలెంజ్ ప్రయత్నించిన వారికి ప్రమాదకరంగా మారుతుంది. ఇంతకీ  ఈ చాలెంజ్ ఏమిటి అంటారా... నోటి నిండా సాల్ట్ వేసుకొని... ఉప్పు  మింగకుండా సోడా తాగాలి. ఇక ఆ తర్వాత నోటి నిండా ఉన్న ఉప్పును ఉమ్మి  వేయాలి. కాగా ఇది ప్రాణాలకు ప్రమాదకరం అని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: