నా భర్తతో గతంలో దూరంగా ఉన్నాను.. ఇప్పుడు విడాకులు ఇచ్చాను!

Edari Rama Krishna

బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన మైనే ప్యార్ కియా  అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసింది. అప్పట్లో యూత్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.  మ్యూజికల్ హిట్ గా ఇప్పటికీ బాలీవుడ్ లో మారుమోగుతూనే ఉంటుంది.  ఈ చిత్రం తెలుగు లో ప్రేమ పావురాలుగా రిలీజ్ చేశారు.  1989లో విడుదలైన 'మైనే ప్యార్ కియా' చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది అందాల భామ భాగ్యశ్రీ.  ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో అమ్మడికి మంచి ఛాన్సులు వచ్చాయి. కెరీర్ బాగా  కొనసాగుతున్న సమయంలోనే హిమాలయ దస్సానీని వివాహం చేసుకుంది. వైవాహిక బంధం అన్యోన్యంగా కొనసాగుతోంది.

 

 

ఈ మద్య భాగ్యశ్రీ విడాకులు తీసుకుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఒకసారి తన భర్త నుంచి తాను విడిపోయానని... ఏడాదిన్నర పాటు తన భర్తకు దూరంగా బతికానని చెప్పింది. ఆ రోజులను తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుందని తెలిపింది.  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయని.. కానీ తాను మాత్రం మొదట ఇష్టపడ్డ వ్యక్తి  హిమాలయ. అందుకే అతన్ని పెళ్లి చేసుకున్నా. కానీ మేమిద్దరం విడిపోయిన సందర్భం కూడా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది.

 

అయితే చాలా కాలం కలిసి ఉన్న దంపతుల మద్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడం సహజం.. కానీ మా మద్య అంతకు మించి ఉండటం వల్లనే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.  అయితే విడాకులు తీసుకున్న సమయంలో చాలా ఆందోళనకు గురి అయ్యానని.. భాగ్యశ్రీ తెలిపింది. ఆయన మళ్లీ తన జీవితంలోకి రారా? తాను మరో వివాహం చేసుకోవాలా? అనే భయాందోళనలకు గురయ్యానని చెప్పింది. మన జీవితంలో కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తే హృదయం కలచివేసినట్లు అవుతుందని.. ఆ రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ భయం కలుగుతుందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: