ఇప్పట్లో షూటింగ్ కి రానంటున్న కాజల్.. ఎందుకో తెలుసా?

Edari Rama Krishna

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించినంది అందాల కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్.  గత ఏడాది కవచం, సీత చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఒకప్పుడు సీనియర్ హీరోల సరసన మాత్రమే నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు కుర్ర హీరోల సరసన కూడా నటింస్తుంది.  తాజాగా శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్2’ చిత్రంలో నటిస్తుంది. ఈ మద్య చిత్ర షూటింగ్ సమయంలో క్రేన్ ప్రమాదంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. అప్పటికే కాజల్ షూటింగ్ పూర్తి కావడం వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. 

 

దాంతో తాను తృటిలో తప్పించుకున్నా అప్పటి వరకు తనతో పని చేసిన వారు చనిపోవడం కాజల్ జీర్ణించుకోలేక పోయింది.  కాగా,  ఈ సంఘటన తరువాత కాజల్‌అగర్వాల్‌ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయిందట.  మహాశివరాత్రి సందర్భంగా ఈషా ఫౌండేషన్‌ కోయంబత్తూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం పాల్గొన్న కాజల్‌అగర్వాల్‌ ఆ తరువాత ఇంటి నుంచి బయటకు  రాలేదట. అంతే కాదు మరో రెండు వారాల పాటు చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొనని ఇండియన్‌–2 చిత్ర నిర్మాతలకు ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం. 

 

ఈవీపీ స్టూడియోలో షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో  కృష్ణ అనే సహాయ దర్శకుడు, చంద్రన్‌ అనే సహాయ కళాదర్శకుడు, మధు అనే మరో సహాయకుడు ప్రాణాలను కోల్పోయారు.  కాజల్‌అగర్వాల్‌ తమిళంలో దుల్కర్‌సల్మాన్‌కు జంటగా మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఆ చిత్రం నిర్మాణంలో ఉంది.. మరి ఈ అమ్మడు ఈ షూటింగ్ లో ఏమైనా పాల్గొంటుందా లేదా కొన్ని రోజుల పాటు మానసిక విశ్రాంతి కోరుకుంటుందా తెలియాలి. ప్రస్తుతం ఈ అమ్మడు   తెలుగులో మోసగాళ్లు అనే చిత్రంలోనూ, హిందీలో ఒక చిత్రం చేస్తూ ఈ అమ్మడు బిజీగా ఉంది. అయితే కోలీవుడ్ లో వస్తున్న వార్తల విషయంపై కాజల్ అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ మాత్రం చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: