జాను: ఇంత హార్ట్ ట‌చ్చింగ్ ల‌వ్‌స్టోరీయా...!

Edari Rama Krishna

ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో రిమేక్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దిల్ రాజు తమిళంలో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న 96 మూవీ రిమేక్ గా తెలుగు లో ‘జాను’ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ మూవీకి తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెలుగు  దర్శకత్వం వహించారు.  సమంత శర్వానంద్ జంటగా నటించిన 'జాను'సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని తమిళంలో సూపర్ హిట్ అయిన మూవీస్ తెలుగు లో రిమేక్ చేస్తే మంచి ఫలితాలు దక్కని పరిస్థితి ఉంది. కానీ దిల్ రాజు మాత్రం 96 మూవీ చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు లో తీయాలని పట్టుదలతో ఈ మూవీ తెరకెక్కేలా చేశారు. 

 
ఈ విషయంలో దిల్ రాజు ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా 96 కథను తెలుగులో రీమేక్ చేశాడు.  గతంలో రవితేజ ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ను చెప్పుకోవచ్చు. తమిళ్ సినిమా ‘ఆటోగ్రాఫ్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్. కాకపోతే అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. కానీ ఇప్పుడు తెరకెక్కిన జాను మాత్రం అందరి మనసు దోచిందంటున్నారు. సమంత, శర్వానంద్, దిల్ రాజు లు అందరూ రిస్క్ అన్నా సరే అద్భుతంగా నటించి, మెప్పించి, రిస్క్ లోనే సక్సెస్ ఉందని మరోసారి రుజువు చేశారు. టైటిల్ రోల్ చేసిన గౌరీ , సమంతలు నటనతో సినిమాని నిలబెట్టేసారు.

 


అలాగే శర్వానంద్, సాయి కిరణ్ లు కూడా ఓకే అనిపించుకున్నారు.  కంప్లీట్ లవ్ డ్రామా అవ్వడం, స్లో నేరేషన్ కావడం వలన, రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ లాంటివి లేకపోవడం వలన కొంతమందికి బోర్ కొడుతోంది. కానీ ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ చూసి, మన మెమొరీస్ ని కూడా గుర్తు చేసుకొని ఎంజాయ్ చేయాలనుకునేవాళ్ళు తప్పక చూడచ్చు అంటున్నారు ప్రేక్షకలుు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: