హీరో అవ్వడానికి బ్యాగ్రౌండ్ కాదు... కంటెంట్ ముఖ్యం.. నేను హీరో అవుతున్న.. నందు
హీరో నందు.. ‘సవారి’ చిత్రంతో ఫిల్మ్ నగర్ లో సెటిల్ కాబోతున్నా అంటూ సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. అయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఉండాలంటే కావాల్సింది బ్యాగ్రౌండ్ కాదు. సినిమాలో కంటెంట్.. ఆ కంటెంట్ ఉన్నోడే ఫిల్మ్ నగర్ లో ఉండగలుగుతాడని అన్నారు. ఇప్పుడు ఈయన అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన నటించిన సవారి చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు యువ హీరోలు విశ్వక్ సేన్, కార్తికేయలు హాజరుకాగా.. నందు ఆవేశంగా మాట్లాడారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా నేను ఒక టర్నింగ్ పాయింట్ కోసం ఎదురుచూస్తున్నా. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు.. ‘నందు నువ్ మంచి యాక్టర్‌వి రా.. నీకు ఛాన్స్ రావాలి అని.. ఛాన్స్ రావాలంటే మీరు ఇస్తేనే కదరా నాకు వస్తుంది’ అని నేను ఫీల్ అవుతూనే ఉన్నా.. కాని చివరికి నాకు ఛాన్స్ ఇవ్వడానికి ఇండస్ట్రీ నుండి ఒకడు ముందుకు వచ్చాడు అతనే ఈ చిత్ర దర్శక, నిర్మాత సాహిత్. నాకు సాహిత్ దేవుడి లెక్క. నేను ఇప్పుడు చెప్తున్నా.. ఈ సినిమా పక్కాగా హిట్ అవుతుంది. ఈ సినిమా విషయంలో రెండో థాట్ లేదన్నారు.
హీరో కార్తికేయ, విశ్వక్ సేన్, నేను ముగ్గురం దిల్సుఖ్నగర్ నుండి వచ్చిన వాళ్లమే. మా ముగ్గురిలో మరో కామన్ పాయింట్ ఏంటంటే.. ముగ్గురికీ బ్యాగ్రౌండ్ లేదు. ఫిల్మ్ నగర్ లో సెటిల్ అవ్వడానికి కావాల్సింది బ్యాగ్రౌండ్ కాదని వారు నిరూపించారన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి బ్యాగ్రౌండ్ లేని మరో హీరోని ముందుకు తీసుకువస్తున్నారు. నేను ఫిల్మ్‌నగర్ కి వచ్చేస్తున్నా. సవారితో నా ఫిల్మ్ నగర్‌కి నా సవారీ మొదలైందన్నారు.
ఫిబ్రవరి 7న మేం బ్లాక్ బస్టర్ మూవీతో థియేటర్స్‌కి వస్తున్నాం. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన తరువాత సక్సెస్ మీట్లో మిగతా విషయాలు మాట్లాడతా’ అంటూ చిత్ర విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది విషెష్ అందించారు. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్.. అక్కినేని హీరో నాగచైతన్య, మంచు మనోజ్, దర్శకుడు సుకుమార్, సురేందర్ రెడ్డి ఇలా చాలా మంది నన్ను మెచ్చుకున్నారు. ఇండస్ట్రీ నుండి నా మంచి సపోర్ట్ లభించింది. కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీ తప్పకుండా సపోర్ట్ చేస్తుందని ఈ చిత్రం ద్వారా తెలిసింది.