తారక్ ను కోపంతో తిట్టేసిన డైరెక్టర్... కోపంతో సెట్స్ నుండి వెళ్లిపోతానన్న తారక్...?

Reddy P Rajasekhar

జూనియర్ ఎన్టీఆర్... వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా సినిమాకు తన క్రేజ్ ను మార్కెట్ రేంజ్ ను పెంచుకుంటున్న హీరో. తన నటనతో ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేస్తున్న జూనియర్ బాలనటుడిగా బాల రామాయణం సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు. గుణశేఖర్ దర్శకుడిగా జూనియర్ ఎన్టీయార్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. ఎం.ఎస్. రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు కూడా వచ్చింది. 
 
జూనియర్ ఎన్టీయార్ ఈ సినిమా షూటింగ్ సమయంలో విపరీతంగా అల్లరి చేసేవాడట. సినిమాలో నటించిన వారిలో ఎక్కువమంది చిన్నారులే నటించడంతో వారిని కంట్రోల్ చేయడం యూనిట్ కు చాలా కష్టమైందట. షూటింగ్ కోసం తెచ్చిన బాణాలను విరిచేస్తూ యూనిట్ కు తారక్ చుక్కలు చూపించాడట. ఈ చిత్ర దర్శకుడు గుణ శేఖర్ శివ ధనుర్భంగం కోసం ఒక ప్రత్యేకమైన టేకుతో తయారు చేసిన విల్లును తయారు చేయించాడట. 
 
టేకుతో తయారు చేసిన విల్లుతో పాటు మరో డూప్లికేట్ విల్లును కూడా అక్కడే పెట్టగా తారక్ మిగతా చిన్నారులతో కలిసి డూప్లికేట్ విల్లును పైకి లేపే ప్రయత్నం చేశాడట. డూప్లికేట్ విల్లు పెద్దగా బరువు లేకపోవడంతో సులభంగా పైకి లేపగలిగారు. ఆ తరువాత తరువాత టేకుతో తయారు చేసిన విల్లు కోసం వెతికి టేకుతో తయారు చేసిన విల్లును పైకి లేపి కింద పడేసి విరగ్గొట్టాడట తారక్. 
 
గుణశేఖర్ కోపంతో తారక్ ను బాగా తిట్టాడట. గుణశేఖర్ తిట్టడంతో హర్ట్ అయిన తారక్ తాను సెట్స్ నుండి వెళ్లిపోతానని చెప్పాడట. వానరుల వేషాల్లో ఉన్న పిల్లలపై సీన్లు చిత్రీకరించే సమయంలో వానర వేషాల్లో ఉన్న పిల్లల మూతులు పీకడం లేదా తోకలు లాగడం చేసేవాడట తారక్. షూటింగ్ కోసం బాగా చలిగా ఉండే చేలకుడి ప్రాంతానికి వెళ్లిన సమయంలో తారక్ చొక్కాలు లేకుండా నటించే పిల్లలను బాణాలతో పొడుస్తూ తెగ ఏడిపించేవాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: