ప్రభాస్ రాజమౌళి మధ్య చిరంజీవి రాయబారాలు !

Seetha Sailaja

రాజమౌళి ప్రభాస్ ల సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్ రాజమౌళిని ప్రభాస్ తన కుటుంబ సభ్యుడుగా భావిస్తాడు. ఇలాంటి వీరిద్దరి సాన్నిహిత్యం మధ్య వీరి ప్రస్తుత సినిమాలు అముకోకుండా దూరాన్ని పెంచుతాయా అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. 

రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ను జూలై 30న విడుదల చేయడం కష్టం కాబట్టి ఈ మూవీని అక్టోబర్ 2 విడుదల చేయడానికి జక్కన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘సాహో’ షాక్ నుండి తేరుకుని ప్రస్తుతం దిల్ రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని వేగంగంగా పూర్తి చేసి ఏరో విధంగా అక్టోబర్ లో వచ్చే దసరా పండుగ సీజన్ లో విడుతల చేయఫానికి ప్రభాస్ ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాట్లు టాక్. 

ఈ నేపధ్యంలో ప్రభాస్ రాజమౌళిల మధ్య అనుకోని విధంగా క్లాష్ ఏర్పడుతుందా అంటూ ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. వాస్తవానికి ఇదే దసరా సీజన్ ను టార్గట్ చేయడానికి చిరంజీవి కొరటాల మూవీ కూడ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ‘ఆర్ ఆర్ ఆర్’ తో పోటీ తప్పనిసరి అయితే చిరంహీవి రాజమౌళికి లైన్ క్లియర్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి సీజనకు రావాలని ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాడు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ భారీ గ్రాఫిక్ వర్క్స్ తో ముడిపడి ఉండటం ప్రభాస్ లేటెస్ట్ మూవీ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభం కావడంతో రాజమౌళి ప్రభాస్ సినిమాల రిలీడేట్ ప్లాన్స్ లో కూడ మళ్ళీ మార్పులు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

దీనితో వీరి మూవీ  ప్రాజెక్ట్స్ పురోగతికి సంబంధించిన వాస్తవ విషయాలు తెలుసు కోవాలని చిరంజీవి చాల వ్యూహాతమకంగా వీరిద్దరి సినిమాల రిలీజ్ ప్లాన్స్ గురించి ముందుగా సమాచారం సేకరించి దానికి అనుగుణంగా తన లేటెస్ట్ మూవీ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేసుకోవాలని ఇప్పటి నుంచే రాయబారాలు ప్రారంభించినట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో రాబోతున్న దసరా సీజన్ లో ప్రభాస్ రాజమౌళిల మధ్య కానీ లేదంటే ప్రభాస్ చిరంజీవిల మధ్యకాని మళ్ళీ లేటెస్ట్ గా సంక్రాంతి సీజన్ కు జరిఫినట్లుగా మరొక భారీ ఫైట్ జరిగే ఆస్కారం ఉంది అంటూ ఎప్పుడో రాబోతున్న దసరా సీజన్ గురించి ఇప్పటి నుంచి ఊహాగానాలు మొదలు అయ్యాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: