మరో రిమేక్ లో వెంకీ..?

shami
మసాల వంటి రిమేక్ మూవీ లో నటించిన విక్టరి వెంకటేష్.. మరోసారి మళయాల సూపర్ హిట్ మూవీ దృష్యం రిమేక్ లో నటించనున్నారు. విలక్షణ దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ ఫిల్మ్ సమర్పణలో సురేష్ ప్రొడక్షన్ వారు నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.. మోహన్ లాల్ , మీన జంటగా నటించిన ఈ సినిమా, అప్పట్లో సంచలన విజయం సాదించడంతో పాటు..విమర్శకుల ప్రసంసలను కూడా అందుకుంది. ఇప్పుడు అదే కథా ఆదారంగా మాలిని 22 దర్శకురాలు శ్రీప్రియ డైరెక్షన్ లో వెంకి కథానాయకుడిగా తెరకె క్కబోతుంది ఈ సినిమా.. ఇంకా దీని గురించి మరింత సమాచారం తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.. ఇప్పటికే 22 కొట్టాయం సినిమా ని తెలుగు తమిళ్ లో రీమేక్ చేస్తున్న శ్రీ ప్రియ వెంకీ ని డైరెక్ట్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. కొత్తవారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేష్ శ్రీ ప్రియ కు అవకాశం ఇవ్వడం తనకు ఒక మంచి లైఫ్ ఇచ్చినట్లేనని అనుకుంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఆల్రెడీ మారుతి దర్శకత్వంలో రాధ సినిమా చేస్తున్న వెంకటేష్ ఇప్పుడు మరళ ఈ లేడీ డైరక్టర్ కి కూడా చాన్స్ ఇచ్చి వారెవా అనిపించుకున్నాడు.సో మొత్తానికి హిట్ల పరంపరలో కొద్దిగా వెనుకబడిన వెంకీకి ఈ రెండు సినిమాలు మంచి హిట్ ని ఇవ్వాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: