హెరాల్డ్ బర్త్ డే : జనవరి 6న బర్త్ డే జరుపుకుంటున్న ప్రముఖులు వీళ్ళే..?

praveen

చరిత్రలో చూసుకుంటే ప్రతి రోజూ ఎంతోమంది ప్రముఖులు జనాలు జరుగుతూ ఉంటాయి. జనవరి 6వ తేదీన ఏ ప్రముఖులు జననాలు జరిగాయో తెలుసుకుందాం రండి.

 

 

కపిల్ దేవ్ జననం  : ప్రముఖ భారత దిగ్గజ క్రికెట్ ఆటగాడు కపిల్ దేవ్. ఇండియన్ జట్టుకు అందని ద్రాక్షగా  ఉన్న ప్రపంచకప్ను మొదటిసారి అందించిన గొప్ప సారథి. కపిల్ దేవ్ సారథ్యంలోని మొదటిసారి ఇండియన్ జట్టు ప్రపంచ కప్ ను  సొంతం చేసుకుంది. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడి కపిల్ దేవ్ ఇండియన్ జట్టుకు ఎన్నో విజయాలను సొంతం చేసాడు. జట్టులో కీలక ఆటగాడిగా వ్యవహరిస్తూ జట్టుకు సారథ్యం వహిస్తు  జట్టును ముందుకు నడిపించడంలో విజయవంతం అయ్యాడు కపిల్ దేవ్. ఎన్నో రికార్డులను సైతం నెలకొల్పి ఇప్పటికీ ఎంతో మంది ఆటగాళ్లకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. కాగా కపిల్ దేవ్  1959 జనవరి 6వ తేదీన జన్మించారు. కపిల్ దేవ్ భారతదేశపు అత్యంత గొప్ప ఆల్ రౌండర్ గా రికార్డు సృష్టించాడు. 

 

 

 ఏ ఆర్ రెహమాన్ : భారతదేశంలోని అత్యంత పేరుగాంచిన సంగీత దర్శకుల్లో ఒకరు ఏ ఆర్ రెహమాన్. ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్. స్వరకర్త గాయకుడు గేయ  రచయిత నిర్మాత సంగీతకారుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ.ఆర్.రెహమాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఏ.ఆర్.రెహమాన్ 1966 జనవరి 6వ తేదీన జన్మించారు. ఆయన  సంగీతానికి గాను జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు ఏ ఆర్ రెహమాన్. ఏదైనా సినిమాలో ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంది అని ప్రేక్షకులు అందరూ భావిస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతమైన పాటలను కంపోజ్ చేసి ప్రేక్షకులందరికీ అందించాడు. వివిధ భాషల్లో ఏ.ఆర్.రెహమాన్ ప్రసిద్ధమైన గాయకుడిగా కొనసాగుతున్నాడు. 

 

 

 పద్మ దేవేందర్ రెడ్డి : మెదక్ జిల్లా ఎమ్మెల్యే గా పద్మాదేవేందర్రెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు. గతంలో తెలంగాణ  అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 జనవరి 6వ తేదీన పద్మాదేవేందర్రెడ్డి జన్మించారు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యేగా  రెండోసారి గెలిచి  తన సత్తా చాటారు.

 

 

 వందేమాతరం శ్రీనివాస్ : ప్రముఖ రచయిత దర్శకుడు నిర్మాత గాయకుడు అయిన వందేమాతరం శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు కొసమెరుపు. వందేమాతరం శ్రీనివాస్ ఎన్నో సినిమాల్లో నటించడమే కాకుండా తెలుగు సినిమాల్లోని దర్శకత్వం కూడా వహించారు. అంతేకాకుండా ఎన్నో సినిమాలు విలక్షణమైన పాత్రల్లో నటించి తన సత్తా చాటారు వందేమాతరం. వందేమాతరం శ్రీనివాస్ అంటే ఫోక్ సాంగ్స్ కి పెట్టింది పేరు. ఇకపోతే అయినా 1966 జనవరి 6వ తేదీన జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: