ముద్దులతో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్ .. వైరల్ అవుతున్న వీడియో

Satvika

View this post on Instagram
Happy new year guys .hello to happiness , laughter and good memories

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

" />

ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రీయ శరన్.. ఆ సినిమా హిట్ అవ్వక పోయిన కూడా తదుపరి వరుస సినిమాలో నటిస్తూ వచ్చింది. నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి పెద్ద హీరోల సరసన నటించిన శ్రీయ గత కొంత కాలంగా సినిమాలకు దూరమైనది. యువతకు కావలసిన అందం ఉన్నా కూడా అమ్మడుకు సినిమా ఆఫర్లు మాత్రం అందని ద్రాక్షలా మారాయి.

 

తెలుగులో ఒకప్పుడు బాగా ఫామ్లో ఉన్న హీరోయిన్ శ్రీయ శరన్.. స్టార్ హీరోల సరసన జతకట్టిన శ్రీయ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది.  2018 మార్చ్ లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కొస్కీవ్‌ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లిచేసుకున్న శ్రీయ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. తెలుగులో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తరవాత మరో సినిమాలో శ్రియ కనిపించలేదు. ప్రస్తుతం రష్యాలో నివాసముంటుంది. 

 

అయితే,  శ్రీయ ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోలను సోషల్ మీడియాలో  ఫోటోలు పోస్ట్ చేస్తూ వస్తుంది. అలా ప్రేక్షకులకు దగ్గర ఉంది. కాగా, న్యూ ఇయర్ సందర్భంగా తన భర్తతో కలిసి శ్రియ అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇస్టాగ్రాంలో రెండు పోస్టులు పోస్ట్ చేసింది. ఒక పోస్ట్‌లో తన భర్తతో ఓ రెస్టారెంట్‌లో దిగిన ఫొటోలు జత చేయగా,మరో ఫొటోలో భర్త పెదాలపై శ్రియ ముద్దాడుతున్నారు. 

 

ఇది ఇలా ఉండగా మరో పోస్ట్ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ అని పాట పాడుతూ శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులపై ముద్దుల వర్షం కురిపించారు. అలా విషేష్ చెప్తూ వీడియో చివరిలో ముద్దులతో ముంచేశారు. ఇంకా  ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని శ్రియ, ఆండ్రీ కోరుకున్నారు.  విషెస్ మాట పక్కన పెడితే ముద్దుల విషెస్ మాత్రం నెటిజన్లకు పని పెట్టింది. ఎవరికీ తగ్గట్లు వారు కామెంట్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది.