రాజమౌళిని డార్క్ లో పెట్టిన రితీష్ రానా !
ఈవారం క్రిస్మస్ రోజు విడుదలైన ‘మత్తు వదలరా’ మూవీ సూపర్ సక్సస్ సాధించడంతో ఈమూవీ దర్శకుడు రితీష్ రానా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంగా ఈ సినిమా సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాకు షేర్ చేసాడు.
ఈ సినిమాకు సంబంధించిన కథను ఈ మూవీ నిర్మాతకు వివరిస్తున్నప్పుడు ఆ నిర్మాత ఒక వ్యక్తిని పిలిచి అతడికి కూడ కథ చెప్పమని కోరిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి శ్రీ సింహా అని అతడు కీరవాణి కొడుకు అని తనకు అప్పటికి తెలియదు అన్న విషయాన్ని షేర్ చేసాడు.
తాను కీరవాణి కొడుకు అయినప్పటికీ అందరితో సమానంగా శ్రీ సింహా కు కూడా ఆడిషన్ టెస్ట్ పెడతానని అన్న విషయాన్ని చెప్పినప్పుడు ఈ మూవీని తీసిన నిర్మాత కొద్దిగా షాక్ అయినా తనకు దర్శకుడుగా పూర్తి స్వేచ్చ ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. ఇదే సందర్భంలో ఈసినిమా ప్రారంభించే ముందు తాను ఈ కథను రాజమౌళికి కాని అదేవిధంగా కీరవాణికి కాని చెప్పలేదు అన్న సీక్రెట్ ను కూడా బయటపెట్టాడు.
అయితే దర్శకుడుగా తనకు ఉన్న స్వేచ్చను గుర్తించి రాజమౌళి కూడ ఈ మూవీ ఫైనల్ కాపీ తయారు అయ్యేవరకు ఎక్కడా ఈ మూవీ విషయాలలో వేలుపెట్టక పోవడంతో తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీసి విజయం సాధించగలిగాను అని అంటున్నాడు. ఈ మూవీకి రోజురోజుకు కలక్షన్స్ పెరుగుతున్న నేపధ్యంలో ప్రస్తుతం ఈ మూవీ ధియేటర్స్ సంఖ్యను కూడ పెంచడంతో ముగిసిపోతున్న ఈ సంవత్సరంలో ఒక ఊహించని హిట్ ఈ మూవీ ఇచ్చి మత్తు వదిలించింది. ఇప్పటి వరకు దర్శకులు సంగీత దర్శకుల వారసులు హీరోలుగా సక్సస్ అయిన సందర్భాలు లేవు. అయితే ఈ అరుదైన రికార్డును కీరవాణి కొడుకు అందుకోవడంతో కీరవాణి మంచి జోష్ లో ఉన్నట్లు టాక్..