దేవి శ్రీ ప్రసాద్ తో పోటీ పై తమన్ ఏమన్నాడో తెలుసా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో బడా మ్యూజిక్ డైరెక్టర్ లు ఎవరు ఉన్నారు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు దేవిశ్రీప్రసాద్, తమన్. ప్రస్తుతం బడా హీరోల సినిమాల్లో ఈ సంగీత దర్శకులే స్వరాలను అందిస్తున్నారు. వీరి మ్యూజిక్ హిట్ అయినా ఫ్లాప్ అయినా వీరికి మాత్రం బడా హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కుతూనే ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్లో దేవిశ్రీ తమన్ ట్రెండ్ నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక వీరు ఇచ్చే మ్యూజిక్ కి కూడా తెలుగు ప్రేక్షకులందరూ బాగా అలవాటు పడిపోయారు. అందుకే పెద్ద హీరోల సినిమాల్లో ఈ ఇద్దరు కాకుండా వేరే కొత్త డైరెక్టర్లు మ్యూజిక్ అందించారు అంటే ప్రేక్షకులను ఆ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ ల మధ్య పోటీ ఉంటుంది.
దేవిశ్రీ ఒక బడా హీరో కి మ్యూజిక్ అందిస్తే... తమన్ మరో స్టార్ హీరో కి మ్యూజిక్ అందిస్తూ ఉంటారు. ప్రతి సినిమాలో వీరి మ్యూజిక్ ప్రేక్షకులను మరింత అలరిస్తూ అదరగొడుతుండంతో తెలుగు ప్రేక్షకులు కూడా వీరిద్దరు అందించిన మ్యూజిక్ కు అలవాటు పడిపోయారు. దీంతో అగ్ర హీరోల సినిమా వస్తుందంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సంగీత దర్శకులుగా ఉండాల్సిందే అన్నంతగా ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండ్ ఫిక్స్ అయిపోయింది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా... స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న అలా వైకుంఠపురములో సినిమాకి తమన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి.. దేవిశ్రీ సంగీతంలో సరిలేరు నీకెవ్వరు... మీరు సంగీతం సమకూర్చిన అలా వైకుంఠపురములో సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్నాయి కదా... మీ పైన ఏమైనా ఒత్తిడి అని ప్రశ్నించగా... పోటీ ఉన్నప్పుడే మన స్టామినా ఏంటో తెలుస్తుంది అంటూ తమను జవాబిచ్చారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయి.. మేమిద్దరం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉంటామని తమన్ తెలిపారు. అంతేకాకుండా గతంలో తాను దేవి శ్రీ ప్రసాద్ వద్ద తొమ్మిది సినిమాలకు ప్రోగ్రామర్ గా కూడా వ్యవహరించారు అని తెలిపారు తమన్ .