అలాంటి వాళ్ల నోరు మూయించిన థమన్..!
కిక్ సినిమాతో మ్యూజిక్ డైరక్టర్ గా పరిచయమైన థమన్ ఆ సినిమాతోనే తన టాలెంట్ ఏంటో చూపించాడు. అప్పటికి సూపర్ ఫాం లో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ కు మంచి కాంపిటీటర్ గా ఉంటూ వస్తున్న థమన్ ఈమధ్య వరుస సూపర్ హిట్ ఆల్బంస్ ఇస్తున్నాడు. ప్రస్తుతం థమన్ సూపర్ ఫాం లో ఉన్నాడని చెప్పొచ్చు. అతను చేసిన సినిమాలు కమర్షియల్ గా హిట్ అవడమే కాకుండా మ్యూజికల్ గా కూడా బాగుంటున్నాయి.
ఈమధ్య వచ్చిన వెంకీమామతో హిట్ అందుకున్న థమన్ లేటెస్ట్ గా సాయి తేజ్ ప్రతిరోజు పండగే సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో తో పెద్ద టార్గెటే పెట్టుకున్నాడు. ఒకప్పుడు థమన్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే అది ఎక్కడ నుండి లేపేశాడో అని వెతికే బ్యాచ్ అందరికి ఇప్పుడు సరైన ఆన్సర్ ఇస్తున్నాడు.
కాపీ క్యాట్ ట్యూన్స్ అంటూ థమన్ ను ఆటాడుకున్న వాళ్లందరి నోళ్లు మూయించేలా ఈమధ్య అతని ట్యూన్స్ ఉంటున్నాయి. ఓ విధంగా థమన్ ఇప్పుడు సూపర్ జోష్ లో ఉన్నాడు. చేసిన సినిమా హిట్ అవడంతో మరింత ఉత్సాహంతో అతను మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓ పక్క అల్లు అర్జున్ ఆల్బం థమన్ ఆల్ టైం రికార్డ్ అయ్యేలా ఉంది. రీసెంట్ గా వచ్చిన బుట్టబొమ్మా సాంగ్ కూడా అంతర్జాలాన్ని స్థంభించేలా వ్యూస్ వస్తున్నాయి.
సినిమా పరంగా ఎలా ఉన్నా అల వైకుంఠపురములో మ్యూజిక్ పరంగా ఇప్పటికే సూపర్ హిట్ అన్నట్టే లెక్క. మరి థమన్ మ్యూజిక్ ఈ రేంజ్ లో ఇచ్చాడు అంటే త్రివిక్రం తన బ్రైనుకి పని.. తన పెన్నుకి పదును బాగానే పెట్టి ఉంటాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకోవాలంటే మాత్రం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.