తన ఇంట్లో జరిగిన జీఎస్టీ దాడులపై స్పందించిన యాంకర్ అనసూయ.. వాళ్లకి స్వీట్ వార్నింగ్.?

praveen

గత కొన్ని రోజులుగా భాగ్యనగరంలో జిఎస్టి అధికారులు భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రముఖ సెలబ్రిటీల నివాసాల్లో కూడా జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు అని వార్తలు వచ్చాయి. కాగా  టాలీవుడ్ లో ప్రముఖ సెలబ్రెటీ లైనా అనసూయ సుమ ఇళ్ల పై జిఎస్టి అధికారులు దాడి చేశారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో ఈ అంశం పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియాలో  సెలబ్రిటీల నివాసాల్లో  జిఎస్టి అధికారుల దాడులు చేశారనే హాట్ టాపిక్ గా మారింది . రెండు రోజుల వరకు ఇదే హాట్ టాపిక్ గా కొనసాగింది.. అయితే ప్రముఖ సెలబ్రిటీల ఇళ్లలో జీఎస్టీ దాడులు జరిగాయని వచ్చిన వార్తలు మాత్రం అవాస్తవమని తెలుస్తోంది. 

 ఇప్పటికే యాంకర్ సుమ నివాసంలో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన యాంకర్ సుమ... తన  నివాసం లో ఎలాంటి సోదాలు జరగలేదని.. మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందంటూ... తన ఇంట్లో సోదాలు జరిగినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది. తాజాగా యాంకర్ అనసూయ కూడా ఈ తరహాలోనే స్పందించండి. మీడియా అంటే సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాలి తప్ప వ్యక్తిగత అభిప్రాయాలను అందించరాదనీ  యాంకర్ అనసూయ హితవు పలికారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో జిఎస్టి అధికారులు సోదాలు నిర్వహించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని... ఒకరి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించకుండా.. ఏ  విషయం అయిన పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత వార్తలు అందించాలని  అంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు అనసూయ. 

 ట్విట్టర్ వేదికగా అనసూయ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే అనసూయ ప్రస్తుతం జబర్దస్త్ షోలో యాంకర్ గా కొనసాగుతూ తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు విషయం తెలిసిందే. అయితే ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ లోనే కాకుండా జీ తెలుగులో కూడా ఓ  ప్రోగ్రాంలో జడ్జిగా ప్రత్యక్షమై తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా అదరగొడుతుంది ఈ అమ్మడు. మరోవైపు సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటూ తన సత్తా చాటుతోంది. అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటూ  దూసుకుపోతుంది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: