సరిలేరు నీకెవ్వరు.. క్రేజీ ట్రైన్ ప్రమోషన్స్..!
సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబోలో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన 3 సాంగ్స్ ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో క్రేజీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
ముఖ్యంగా మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రయూనిట్ ట్రైన్ ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. హైదరాబాద్ టూ బెంగళూరు.. హైదరాబాద్ టూ చెన్నై వెళ్లే ట్రైన్లకు అవుట్ డోర్ పోస్టర్స్ తో సినిమా ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ కు ఇంకా 20 రోజుల్లో ఉండటంతో సరిలేరు నీకెవ్వరు టీం ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.
పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న డైరక్టర్ అనీల్ రావిపుడి మహేష్ తో చేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా టీజర్ అంచనాలు పెంచగా సంక్రాంతికి మహేష్ సత్తా చాటేలా ఉన్నాడని అంటున్నారు. భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ అందుకోగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
మహేష్ ఈ సినిమాలో ఆర్మీ మేజర్ గా కనిపిస్తున్నాడు. సినిమాలో విజయశాంతి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలేజ్ ఈవెంట్ జనవరి 5న ఎల్బి స్టేడియంలో జరుగనుంది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.