షాకింగ్ సంక్రాంతి జూదంలో ఇరుక్కున్న 250 కోట్లు ఆందోళనలో బయ్యర్లు !

Seetha Sailaja

ఈసారి సంక్రాంతి రేస్ కు రెండు భారీ సినిమాలతో పాటు ఒక భారీ డబ్బింగ్ సినిమా మరో మీడియం రేంజ్ సినిమాలు పోటీ పడుతున్న నేపధ్యంలో ఈ నాలుగు సినిమాల పై 250 కోట్లు బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ కు ఉన్న మ్యానియా రీత్యా ‘సరిలేరు నీకెవ్వరు’ కు 110 కోట్ల బిజినెస్ జరిగితే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీకి 90 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. 

ఇక ఇదే సంక్రాంతి రేస్ కు అందరికంటే ముందుగా వస్తున్న రజినీకాంత్ ‘దర్బార్’ కు 25 కోట్ల బిజినెస్ తెలుగు రాష్ట్రాలలో జరిగితే కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ మూవీకి 20 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ నాలుగు సినిమాలకు 250 కోట్ల బిజినెస్ జరగడంతో ఈ నాలుగు సినిమాలకు సంబంధించి నష్టాలు లేకుండా బయ్యర్లు గట్టెక్కాలి అంటే ఈ నాలుగు సినిమాలకు కనీసం 500 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చి తీరాలి. 

ఇది అంతా కేవలం సంక్రాంతి పండుగ హడావిడి కనిపించే ఒక వారం రోజులలోనే జరిగిపోవాలి. జనవరి 20 తరువాత సంక్రాంతి పండుగ హడావిడి అంతా పూర్తి అయి పోవడంతో సాధారణ ప్రజానీకం అంతా తమ సంక్రాంతి సరదాలను మర్చిపోయి ఎవరికి వారు తమ దైనందిన జీవితాల బిజీలో మునిగిపోతారు.

ఆ తరువాత వచ్చే రిపబ్లిక్ డే నుండి మళ్ళీ కొత్త సినిమాలు రావడం ప్రారంభం కావడంతో సంక్రాంతి సినిమాలు ఏమి చేయాలనుకున్నా కేవలం వాటికి ఉండే సమయం రెండు వారాలు మాత్రమే. దీనితో ఈ 250 కోట్ల సంక్రాంతి జూదంలో ఎంతమంది గెలుస్తారు మరెంతమంది ఓడిపోతారు అన్న విషయమై ఇప్పటి నుంచే రకరకాల లెక్కలు వేసుకుంటూ సంక్రాంతి జూదాన్ని నమ్ముకున్న బయ్యర్లు అంతర్మధనంలో ఉన్నట్లు టాక్..   

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: