రూలర్ బాలయ్యకు ఆఖరకీ మెగా ఫ్లాప్ హీరో కూడా షాకిచ్చేట్టున్నాడే !
నందమూరి బాలకృష్ణ 105వ సినిమాగా రూలర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో రూలర్ సినిమా పై బాలకృష్ణ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటు అభిమానులు కూడా బాలకృష్ణ యాక్షన్ చూసి చాలా కాలమైంది అనే రూలర్ సినిమాలో సరికొత్త యాక్షన్ చూడొచ్చు అని భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ సినిమా మాత్రం అభిమానులను నిరాశపరిచినదనే చెప్పాలి. రూలర్ సినిమాలో కనీసం కొంతైన కొత్తదనం లేకుండా రొటీన్ కథ రిపీట్ అయింది. దీంతో బాలకృష్ణ ఖాతాలో మరో సారి ఫ్లాప్ చేరబోతున్నది అని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు.
బాలయ్య రొటీన్ సినిమాలు అన్నీ కలిపి పరమ రొటీన్ గా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ అని సినిమా చూసిన ప్రేక్షకులు నుండి టాక్ వినిపిస్తుంది. అయితే నేడు బాక్సాఫీస్ వద్ద మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే సినిమా తో పాటు నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా కూడా విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో ప్రతి రోజూ పండగే సినిమాకి మంచి టాక్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ప్రతి రోజు పండగే సినిమా ముందు బాలయ్య రూలర్ సినిమా నిలవలేకపోయింది. యువ హీరో ముందు బాలయ్య రూలర్ కుప్పకూలి పోతుంది అని ప్రేక్షకుల నుంచి టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం బాలయ్య రూలర్ సినిమా లో ఆయన గెటప్ తప్ప మిగతా అంతా రొటీన్ కథ రొటీన్ పాటలు రొటీన్ డైలాగ్స్ ఉండడం ఈ సినిమాకు మైనస్ గా మారింది.
అయితే మెగా హీరోలు అందరిలో ఎక్కువ ప్లాపులు ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్ ఒక్కడే . వరుసగా ఐదు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత చిత్రలహరి సినిమాతో విజయాన్ని అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు ఏకంగా నందమూరి బాలకృష్ణకు మెగా ఫ్లాపుల హీరో కూడా షాక్ ఇచ్చినట్లయింది . ఎందుకంటే ఈ రోజు విడుదలైన ప్రతి రోజు పండగే మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంటే... బాలయ్య సినిమా మాత్రం రొటీన్గా పరమ బోరింగ్ గా ఉంది అంటూ బ్యాట్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఇకనైనా బాలయ్య సినిమాలో చేసే పద్ధతి మార్చుకుని కొత్త కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతాడో లేదో చూడాలి మరి.