రూల‌ర్ ఫ‌స్టాఫ్ హిట్‌... సెకండాఫ్ ఫ‌ట్‌... ?

Reddy P Rajasekhar

నందమూరి బాలకృష్ణ హీరోగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించిన రూలర్ సినిమా ఈరోజు విడుదలైంది. ఎన్టీయార్ కథానాయకుడు, ఎన్టీయార్ మహానాయకుడు లాంటి డిజాస్టర్ల తరువాత బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ సినిమాపై బాలయ్య అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ బాలయ్య మాత్రం రూలర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాడు. 
 
రొటీన్ మాస్ మసాలా యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన రూలర్ సినిమా ఫస్టాప్ బాగానే ఉన్నా సెకండాఫ్ తీవ్రంగా నిరాశపరిచిందని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫస్టాప్ లో కొన్ని కామెడీ సీన్లు, సోనాల్ చౌహాన్ గ్లామర్ ఆకట్టుకోగా ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఓకె అనిపించుకుంది. సెకాండాఫ్ కూడా కనీసం ఫస్టాఫ్ లా ఉన్నా సినిమా కనీసం యావరేజ్ ఫలితాన్ని అందుకునే అవకాశం ఉండేది. 
 
రూలర్ సినిమా సెకండాఫ్ లో వచ్చే సాగదీత సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. సెకండాఫ్ లో విసుగెత్తించే ఫైట్లతో, రొటీన్ పంచ్ డైలాగులతో బాలయ్య అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దర్శకుడు కే ఎస్ రవికుమార్ రూలర్ సినిమాను మరీ రొటీన్ గా తీశాడు. రూలర్ సినిమాలోని చాలా సన్నివేశాలు కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన గత సినిమాలను గుర్తు చేస్తాయి. 
 
కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన లింగా, జై సింహా సినిమాల ఛాయలు ఈ సినిమాలో కనిపించడం గమనార్హం. నెటిజన్లు సోషల్ మీడియాలో రూలర్ సినిమా ఔట్ డేటెడ్ రొటీన్ మూవీ అని బాలయ్య నుండి ఊహించిందే జరిగిందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలయ్య కెరీర్లో రూలర్ సినిమాతో మరో ఫ్లాప్ చేరినట్టే అని చెప్పవచ్చు. ఇప్పటికైనా బాలయ్య రొటీన్ మాస్ మసాలా కథలకు దూరంగా ఉంటూ నవ్యత కలిగిన కథలను ఎంచుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: