వామ్మో.. సాయి ధరమ్ తేజ్ ఆ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడుగా..
మెగా మేనల్లుడు సాయితేజ్ నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ చిత్రంలో తమిళ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు. మరియు అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొని ఉంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ఫస్ట్ గ్లింప్స్, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా యూత్ మొదలుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చాయి.
లంగ్ కేన్సర్‌తో బాధపడుతున్న సత్యరాజ్ వద్దకు ఫారెన్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారులను మనవడు సాయితేజ్ ఎలా దగ్గరకి చేర్చారనేదే ఈ చిత్ర కథాంశంగా ఈ ట్రైలర్‌లో చూపించారు. లవ్, సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక రాశీ ఖన్నా హిరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సుమారు రూ.17 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం రాబట్టాలంటే సినిమా భారీ హిట్ అవ్వాలి. దీన్ని బట్టీ చూస్తే సాయి తేట్ ఈ చిత్రంపై ఆ భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు తేజ్ గత సినిమా ‘చిత్రలహరి’ వసూళ్లు చూస్తే రూ.13 కోట్ల వరకు టచ్ అయింది. ఇక కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేస్తూ.. రెండురెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సో.. ఇన్ని ప్లస్ పాయింట్స్‌తో ఈ కుటుంబ కథా చిత్రం తొలిరోజు మంచి టాక్ తెచ్చుకుంటే భారీ విజయం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాలి. మరోవైపు నందమూరి నటసింహిం బాలకృష్ణ రూలర్ సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది. మరి సాయి బాలయ్యను ఓవర్‌కమ్ చేసి.. భారీ హిట్ కొడతాడో.. లేదో.. చూడాలి.