రొమాన్స్ కు రెడీ అవుతున్న మహేష్ బాబు.. సంక్రాంతికి వేడి పెరుగుతుందిగా..

Satvika

తెలుగు సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు, రష్మిక మందన్న నటిస్తున్నా చిత్రం సరిలేరు నీకెవ్వరూ..దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి 13 ఏళ్ల తరవాత ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, పోసాని తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. 

 

ఇకపోతే భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ విడుదలైంది. అలాగే రెండు పాటలు కూడా వచ్చాయి. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘మైండ్ బ్లాకు’ అంటూ సాగే మాస్ నంబర్ మహేష్ ఫ్యాన్స్ చేత స్టెప్పులేయించింది. ఇప్పుడు ఈ సినిమాలోని మరో పాటను విడుదల చేశారు.

 

తాజాగా ఈ చిత్రం నుండి ఈరోజు మరో పాట రిలీజ్ అయింది. ‘హీ ఈజ్ సో క్యూట్.. హీ ఈజ్ సో హాట్.. హీ ఈజ్ సో హ్యాండ్సమ్’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ను సోమవారం సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేశారు. మ‌హేష్ గ్లామ‌ర్‌ను పొగిడే ఈ పాట సినిమాలో హీరోయిన్ మనసుని హీరో దోచుకున్న సందర్భంలో వస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ సాగే ఈ రొమాంటిక్ పాటకి శ్రీమణి మంచి సాహిత్యం అందిచ‌గా మధు ప్రియ చ‌క్కగా ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ మంచి ట్యూన్ అందించారు.

 

కాగా, ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 5న అంటే ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ ఎల్‌.బి స్టేడియంలో ప్రారంభమవుతుంది.దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: